Indian Railways: ఇండియాలో ఏయే నగరాలకు బుల్లెట్ రైళ్లు

Sat, 19 Dec 2020-7:06 pm,

నాగ్‌పూర్‌ - వారణాసి మధ్య గల హైస్పీడ్‌ రైలు లైన్‌ను ముంబై - నాసిక్‌ - నాగ్‌పూర్‌ కారిడార్‌ వరకు విస్తరించాలి. వారణాసి మీదుగా ముంబైని అనుసంధానించడం దీని లక్ష్యం. దాంతోపాటు ఢిల్లీ - వారణాసి - పాట్నా - గౌహతి కారిడార్‌తోనూ కనెక్ట్‌ అవుతుంది. 

హైదరాబాద్‌ - బెంగళూరు బుల్లెట్‌ రైలు కారిడార్‌ను ముంబై - హైదరాబాద్‌ మార్గంలో విస్తరించడం. ఇది ముంబై - చెన్నై నగరాలను అనుసంధానించడంతోపాటు జమ్ము అమృత్‌సర్‌ వంటి ఉత్తర భారత నగరాల్ని కలుపుతుంది.

పాట్నా నుంచి కతిహార్‌, న్యూ జల్పాయిగురి మీదుగా గౌహతికి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన. గౌహతి నగరాన్ని ఢిల్లీ - ఆగ్రా - కాన్పూర్‌ - లక్నో - వారణాసి బుల్లెట్‌ రైలు కారిడార్‌తో అనుసంధానం కోసం ప్రయత్నం.

ఢిల్లీ-ఆగ్రా-కాన్పూర్‌-లక్నో-వారణాసి బుల్లెట్‌ రైలు కారిడార్‌ను అయోధ్య మీదుగా నిర్మించాలని ప్రతిపాదన. పాట్నా మీదుగా కోల్‌కత్తాకు విస్తరించాలని ప్రతిపాదన.

ఢిల్లీ-చండీగఢ్‌-అమృత్‌సర్‌ బుల్లెట్‌ రైలును పఠాన్‌కోట్ మీదుగా జమ్ముకు విస్తరించడం.  జమ్ము, పఠాన్‌కోట్‌లకు ఆర్దిక పరిపుష్ఠి కల్గిస్తూ..వైష్ణోదేవి ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం

ప్రతిపాదిత ఎన్ఆర్పీ ముసాయిదాలో బుల్లెట్ రైల్ నెట్వర్క్ ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తున్న రూట్స్ ఇవి. 

ముంబై - అహ్మదాబాద్, ఢిల్లీ- ఆగ్రా-లక్నో-వారణాసి, ఢిల్లీ-చండీగఢ్-అమృతసర్, ఢిల్లీ-ఉదయ్‌పూర్-అహ్మదాబాద్, ముంబై-నాసిక్-నాగ్‌పూర్, ముంబైై-హైదరాబాద్, చెన్నై-బెంగళూరు-మైసూరు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link