Indian Railways: తేజస్ స్లీపర్ రైళ్లలో సౌకర్యాలు చూశారా..ప్రయాణం ఇక మరింత సుఖంగా
అన్ని కోచ్‌లలో ఆటోమేటిక్ ఫైర్ అలార్మ్ , డిటెక్షన్ సిస్టమ్ ఉన్నాయి.
అన్ని కోచ్‌లలో ఆటోమేటిక్ డోర్స్ ఉన్నాయి. అన్ని ముఖ్య డోర్లు సెంట్రలైజ్డ్‌గా ఉన్నాయి. గార్డ్ వద్ద మొత్తం కంట్రోల్ ఉంటుంది. అన్ని డోర్లు క్లోజ్ అయ్యేవరకూ ట్రైన్ స్టార్ట్ కాదు. సీట్లకు పీయూ ఫోమ్ ఉపయోగించారు. దాంతో చాలా మెత్తగా ఉంటాయి.
పాసెంజర్ అనౌన్స్‌మెంట్ లేదా పాసెంజర్ ఇన్ఫర్మేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా కోచ్‌లో ఉన్నాయి. ఇందులో డిజిటల్ డెస్టినేషన్ బోర్డ్, సీసీటీవీ నైట్ విజన్‌తో ఇన్‌స్టాల్ అవుతుంది. రాత్రి వేళల్లో కూడా గుర్తించవచ్చు. ప్రయాణీకులకు స్వచ్ఛమైన గాలి తగులుతుంది. ఎయిర్ క్వాలిటీ సిస్టమ్ కూడా ఉంది. ఇందులో ఎమర్జెన్సీ టాక్‌బ్యాక్ ఉంది.
ఈ రైళ్లలో బయో వాక్యూమ్ టాయ్‌లెట్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. దీనివల్ల స్వచ్ఛత పెరగడంతో పాటు నీరు కూడా ఆదా అవుతుంది. టాయ్‌లెట్‌లో టచ్‌లెస్ ఫిటింగ్స్, జెల్ కోటెడ్ షెల్ఫ్, అధునాతన డిజైన్ డస్ట్‌బిన్, లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
ఈ కోచ్‌లోని రైలు బోగీల్లో ఎయిర్ స్ప్రింగ్ సస్ఫెన్షన్ అమర్చడం వల్ల ప్రయాణం హయిగా ఉంటుంది. ఈ కొత్త స్లీపర్ టైప్ తేజస్‌ను ఫిబ్రవరి 15న ప్రారంభించారు. ఇలాంటి ఒక ట్రైన్ అగర్తల- ఆనంద్ విహార్ స్పెషల్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రారంభమైంది. తేజస్ స్లీపల్ టైప్ రైళ్ల కోసం 5 వందల యూనిట్ల కోచ్‌ల తయారీకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది రైల్వే శాఖ. వీటి నిర్మాణం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీలో అవుతుంది.