IRCTC Super App: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త... ఇండియన్ రైల్వేస్ సరికొత్త యాప్.. అన్ని రకాలు సదుపాయాలు ఒకే చోట..
ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ప్రయాణికులు రైల్వే టికెట్ బుక్కింగ్ కోసం ఎక్కువగా ఐఆర్ సీటీసీ యాప్ ను ఉపయోగిస్తున్నారు.
ఇది కేవలం రైల్వే టికెట్ లను బుకింగ్ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ రైల్వే లోకేషన్ ఇతర స్టేటస్ ల కోసం వేర్వేరు యాప్ లను ఉపయోగించాల్సి వచ్చేది. అయితే..దీంతో చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీంతో ఇండియన్ రైల్వేస్ సరికొత్తగా సూపర్ యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తొంది. టికెట్ బుక్కింగ్, పీఎన్ ఆర్ స్టేటస్, ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తొంది.
డిసెంబర్ నాటికి ఈ సూపర్ యాప్ ను ఇండియన్ రైల్వేస్ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. దీంతో రైల్వే ప్రయాణికులకు అన్నిరకాల సదుపాయాలు ఈజీ కానున్నట్లు తెలుస్తొంది.
ఈ సూపర్ యాప్‌ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) అభివృద్ధి చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే వర్గాలు తెలిపాయి. ఇప్పటికే యాప్ సిద్ధమైందని, దానిని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఇండియన్ రైల్వేస్ కు చెందిన ఒక అధికారి చెప్పినట్లు తెలుస్తొంది.