Top 5 Toy Train Places: దేశంలో టాప్ 5 టాయ్ ట్రైన్ ప్రదేశాలివే, ఎక్కడో తెలుసా
నీలగిరి మౌంటెయిన్ రైల్వే
ఇక అసలైంది నీలగిరి మౌంటెయిన్ రైల్వేకు చెందిన టాయ్ ట్రైన్ మంచి అనుభూతిని కల్గిస్తుంది. మెట్టుపాల్యం నుంచి ఊటీ మధ్యలో ఈ టాయ్ ట్రైన్ ఉంటుంది.
మాథేరాన్ హిల్ రైల్వే
మాథేరాన్ హిల్ రైల్వే చాలా పాతది. 1907లో బ్రిటీషర్లు నిర్మించారు. 21 కిలోమీటర్లుండే ఈ రైల్వే లైనులో పశ్చిమ కనుమల్లోని అందమైన ప్రదేశాలు చూడవచ్చు.
కాంగడా వ్యాలీ రైల్వే
కాంగ్డా వ్యాలీ రైల్వే లైన్ కూడా బ్రాడ్ గేజ్ కాదు. హెరిటేజ్ టాయ్ ట్రైన్ హోదా దక్కించుకుంది. ఇది పఠాన్‌కోట్ నుంచి జోగిందర్‌గర్ వరకూ ఉంటుంది. మార్గమధ్యలో ఎన్నో వంతెనలు, టీ తోటలు దాటుకుంటూ వెళ్తుంది.
కాల్కా-షిమ్లా రైల్వే లైన్
కాల్కా షిమ్లా రైల్వే లైన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్‌లో చోటు సంపాదించింది. ఈ రైల్వై లైను కొండ ప్రాంతాలు, టన్నెల్స్ దాటుకుంటూ ఉంటుంది. అన్ని అద్భుతమైన వ్యూ పాయింట్సే కన్పిస్తాయి. 93 కిలోమీటర్లుండే ఈ లైన్‌లో 103 సొరంగాలు, 850 వంతెనలున్నాయి. 5 గంటల జర్నీ సమయం.
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే ఓ ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పాలి. చాలా సినిమాలు ఈ టాయ్ ట్రైన్ ఆధారంగా తీశారు. న్యూ డార్జిలింగ్ వరకూ బ్రాడ్ గేజ్ రైలు ప్రయాణం చేశాక అక్కడ్నించి టాయ్ ట్రైన్ జర్నీ చేయవచ్చు.