Hill Stations: పర్యాటకులకు స్వర్గమే, వర్షాకాలంలో తప్పక సందర్శించాల్సిన 5 అందమైన హిల్ స్టేషన్లు
మున్నార్
ఈ వర్షాకాలంలో ఏదైనా అందమైన హిల్ స్టేషన్ సందర్శించాలంటే మున్నార్ బెస్ట్ ఆప్షన్. ఇది కేరళలో ఉంది. చుట్టూ వ్యాపించి పచ్చని కొండలు పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి
కూర్గ్
కూర్గ్ మరో అద్భుతమైన హిల్ స్టేషన్. ఇది కర్ణాటకలో ఉంది. అత్యంత అందమైన ప్రాంతం. టీ తోటలకు ప్రసిద్ధి. ఇండియన్ స్కాట్లండ్ అని పిలుస్తారు.
నైనితాల్
నైనితాల్ ప్రకృతి రమణీయతకు కేరాఫ్ హిల్ స్టేషన్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఈ హిల్ స్టేషన్ పెద్దఎత్తున పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటుంది. బోటింగ్ అద్భుతమైన అనుభూతినిస్తుంది
మసూరి
మసూరి హిల్ స్టేషన్ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉంది. ఈ ప్రాంతాన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అంటారు. ఇదొక భూతల స్వర్గమని చెప్పవచ్చు.
కానాతాల్
కానాతాల్ హిల్ స్టేషన్ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ సమీపంలో ఉంది. అద్భుతమైన లొకేషన్లకు ఇది ప్రసిద్ధి.