Indias Top 5 Beaches: దేశంలోని ఐదు అందమైన బీచ్‌లు ఇవే
దేశంలోని కేంద్ర పాలితప్రాంతాల్లో ఒకటైన పుదుచ్చేరి బీచ్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి కెరటాల ధ్వనులు వింత అనుభూతిని కల్గిస్తాయి.
ఇక దేశంలోని దీవుల్లో ఒకటి లక్షద్వీప్ . ఇక్కడున్న అగత్తి బీచ్ అందం ముందు ఏదీ నిలవదనే చెప్పాలి. జనాభా తక్కువ కావడంతో కాలుష్యం కూడా కన్పించదిక్కడ
ఇండియాలోని దక్షిణాది రాష్ట్రమైన కేరళను భగవంతుడి ప్రాంతమని పిలుస్తారు. అంత అందమైన రాష్ట్రమిది. త్రివేండ్రంలోని కోవలమ్ బీచ్ పర్యాటకానికి చాలా ప్రసిద్ధి
ఇండియాలో బీచ్ అనగానే గుర్తొచ్చేది గోవా బీచ్. పాశ్చాత్త సంస్కృతి మొత్తం ఇక్కడే కన్పిస్తుంది. గోవాలోని బెనౌలిమ్ బీచ్ తప్పకుండా సందర్శించండి.
ఇక మరో కేంద్ర పాలితప్రాంతం అండమాన్ నికోబార్. ఇక్కడి హ్యావ్‌లాక్ దీవిలో ఉన్న రాధానగర్ బీచ్ చాలా అందమైన ప్రాంతం. మళ్లీ మళ్లీ రావాలన్పించే ప్రదేశం.