Best Summer Vacations: వేసవిలో చల్లదనాన్ని అందించే 5 అందమైన పర్యాటక ప్రాంతాలివే
షిమ్లా
భారతదేశంలో అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో ఒకటి ఇది. వేసవిని ఎంజాయ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ ఇది.
లడాఖ్
వేసవిలో తిరిగేందుకు అద్భుతమైన ప్రాంతమిది. దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశమిది. ఇక్కడ కొండ ప్రాంతాలు, నీలి సరస్సు అందమైన ప్రాంతాలు మనసును హత్తుకుంటాయి.
ఔలి
డెహ్రాడూన్‌కు సమీపంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన టూరిస్ట్ డెస్టినేషన్ ఇది. వేసవిలో కూడా పచ్చని కొండ ప్రాంతాలు, మంచుతో కప్పుకున్న లోయలు, ఎత్తైన ప్రాంతాలు కనువిందు చేస్తాయి.
నైనితాల్
ఇక్కడ నలువైపులా పచ్చని కొండ ప్రాంతాలతో అత్యంత మనోహరంగా ఉంటుంది. వేసవిలో బెస్ట్ వెకేషన్ ప్లేస్ ఇది. ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నైనీ సరస్సులో బోట్ షికారు అందమైన అనుభూతినిస్తుంది.
రాణీఖేత్
ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అత్యంత సుందరమైన చల్లని ప్రాంతాల్లో ఒకటి. రైల్వేస్టేషన్ కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఢిల్లీ నుంచి 355 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఝూలా దేవి ఆలయం, మనోకామేశ్వర్ ఆలయం, భాలూ బాంధ్ వంటి ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలున్నాయి.