Indira Mahila Shakti: మహిళల తలరాతలను మార్చే అద్భుత పథకం.. రూ.10 లక్షలు పొందే ఛాన్స్, ఇలా వెంటనే అప్లై చేసుకోండి..
మహిళా సాధికారతకు తోడ్పడే పథకాలను మహిళలు ముందుగానే తెలుసుకోవాలి. తద్వారా వారు స్వయంగా ఎదుగుతారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి తెలుసుకుందాం.
సాధారణంగా మహిళలు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే మొదటగా గుర్తుకు వచ్చేది బ్యాంకు రుణం. అయితే, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఆ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా క్యాంటిన్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు అద్భుత వరం. స్వయం సమృద్ధితో వ్యాపారం చేయాలనుకునేవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంట్లో ఉండి ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. స్వయం ఉపాధి పొందవచ్చు. ఈ పథకం ద్వారా స్టార్టప్‌లు, బిజినెస్ వంటివి మహిళలు చేసుకోవచ్చు. ఈ పథకం పొందడానికి వెబ్‌సైట్ కూడా అందుబాటులో ఉంది. ఒంటరిగా వ్యాపారం చేయలేని మహిళలు గ్రూపులుగా కూడి చేసుకోవచ్చు.
https://tmepma.cgg.gov.in/home.do అధికారిక వెబ్‌సైట్ ద్వారా మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు వెరిఫై చేసి రిపోర్ట్ రెడీ చేస్తారు. అర్హులైన మహిళలకు బ్యాంకు నుంచి రుణం మంజూరు అవుతుంది.
ఈ రుణంపై వడ్డీని నెలనెలా చెల్లించాలి. మీ అవసరాన్ని బట్టి లోన్ తీసుకోవాలి. మీకు లక్ష రూపాయాలు అవసరం అయితే, నెలకు మీరు రూ.3000 చెల్లించవచ్చు. అలా రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం అందిస్తారు. మీకు ఎవైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు.
info@tmepma.gov.in ఇమెయిల్ చేయవచ్చు. లేదా టోల్ ఫ్రీ నంబర్ 040-12341234 కు కాల్ చేయవచ్చు. సంబంధిత అధికారులు ఈ పథకానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తారు. ఈ పథకం ప్రధాన లక్ష్యం అర్బన్ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడం. మహిళలు స్వయం శక్తితో ఎదగడం.
ఈ మధ్య కాలంలో ఇంటి నుంచి అనేక వ్యాపారాలు మహిళలు ప్రారంభిస్తున్నారు. క్లౌడ్ కిచెన్, కూరగాయల షాపులు, ఫ్యాన్సీ స్టోర్, టైలరింగ్ వంటి వ్యాపారాలు చేస్తున్నారు. అటువంటి మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరం.