Sai Pallavi: సాయి పల్లవి బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన బ్యూటీ..,!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు లేడీ పవర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న సాయి పల్లవి ఇప్పుడు క్వీన్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె నాగచైతన్య తండేల్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా అమరన్ సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో హిందీ రామాయణం సినిమాలో సీత పాత్రలో నటించడానికి సిద్ధమయ్యింది.
ఈ నేపథ్యంలోనే సాయి పల్లవికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సాయి పల్లవి కెరియర్ గురించి అందరికీ తెలుసు. ఇక ఈమె వ్యక్తిగత జీవితం చాలా మందికి తెలియదనే చెప్పాలి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవికి ..మీ కుటుంబం బాగా డబ్బున్న కుటుంబమా? అని ప్రశ్నించగా.. దానికి సాయి పల్లవి అవునండి.. మాది ముందు నుంచి డబ్బున్న కుటుంబమే. అయితే మేము ఏ రోజు కూడా డబ్బు వృధా చేయలేదు.
మాకు ఏదైనా కావాలి అనిపించినప్పుడు అది అవసరమా? లేదా? అనే విషయాన్ని ముందుగా మా నాన్న చూస్తారు. అది కచ్చితంగా కావాలి అనిపిస్తేనే మాకు తీసి ఇస్తారు. ఇక చిన్నప్పటినుంచి మాకు ఇదే అలవాటే వచ్చింది.
ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా నేను ఇదే చేస్తున్నాను. ఇప్పుడు ఇది అవసరం అనిపిస్తే ఖచ్చితంగా అక్కడ నేను తీసుకుంటాను. లేదు అనిపిస్తే నేను సింపుల్ గానే ఉంటాను. ఇక మా తల్లిదండ్రులు నేర్పించింది అదే.. ఇప్పుడు ఇలాగే కొనసాగుతోంది.. ఉంది కదా అని ఏ రోజు కూడా మీ అనవసరంగా వృధా చేయలేదు అంటూ తన సింప్లిసిటీని చెప్పుకు వచ్చింది సాయి పల్లవి.