Actress Tabu photos: టబు గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు

Thu, 05 Nov 2020-7:03 am,
Actress Tabu proved herself from Chandni bar to Andhadhun

చాందిని బార్ నుంచి ఇటీవల వచ్చిన అంధాధున్ వరకు టబు ఎప్పటికప్పుడు తనని నిరూపించుకుంటూనే ఉంటోంది. తాము రాసుకున్న పాత్రలకు టబు మాత్రమే న్యాయం చేయగలదు అని నమ్మిన దర్శకులు ఉండటమే కాకుండా.. ఆమె కోసమే కథలు రాసుకున్న దర్శకులు కూడా ఉన్నారంట. దటీజ్ టబు 

Actress Tabu real name and pet name

టబు చిన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు డైవర్స్ తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి తల్లి రిజ్వానా వద్దే పెరిగింది. టబు అసలు పేరు టబుస్సుం హష్మి కాగా సినిమా సెట్స్‌లో టబు సన్నిహితులు ఆమెను ముద్దుగా ట్యాబ్స్, టబ్స్, టబ్బీ, టాబ్లర్, టాబ్లరోన్ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. అన్నింటికి మించి టబుకు ఇంటర్వ్యూలు ఇవ్వడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. మరీ ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం ( Actress Tabu personal life, Tabu marriage ) గురించి పంచుకోవడం ఆమెకు అస్సలే ఇష్టం ఉండదు. అందుకే టబు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువే.

Actress Tabu career in troubles during her early days

కెరీర్ ఆరంభంలో టబు చేసిన సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమెకు కష్టాలు తప్పలేదు. బోనీ కపూర్ నిర్మించిన ప్రేమ్ సినిమాతో టబుకు తొలిసారిగా బాలీవుడ్‌లో మంచి సూపర్ హిట్ లభించింది. ఆ సినిమా నిర్మాణం కోసం 8 ఏళ్లు పట్టింది. కానీ ఎంతో ఓపిగ్గా చేసినందుకుగాను ఆ సినిమానే టబుకు లక్ తీసుకొచ్చింది. 1994లో వచ్చిన విజయ్‌పథ్ అనే చిత్రం తర్వాత టబు ఇక తిరిగి వెనక్కి చూసుకోలేదు. 

టబుకు చికెన్ బిర్యాని ( Chicken biryani ) అంటే చాలా ఇష్టమట. టబు వాళ్ల అమ్మ కూడా మంచి చెఫ్. కానీ టబు మాత్రం తన ఇష్టాన్ని పక్కనపెట్టి కూరగాయల భోజనం చేయడానికే ఎక్కువ ఇష్టపడతారట. అంతేకాకుండా ఫిట్నెస్‌పై కూడా చాలా ఆసక్తి కనబరుస్తుంది. ఎంతో బిజీ షెడ్యూల్ ఉండి, అత్యవసరంగా బయటికి వెళ్లాల్సి వస్తే తప్ప లేదంటే ఆమె రోజూ తప్పనిసరిగా వ్యాయమం చేస్తుంది. అదే టబు గ్లామర్, ఫిట్‌నెస్ రహస్యం ( Actress Tabu fitness secrets ) .

టబుకు ఎమోషనల్ సీన్స్‌లో ఏడవటం ఎలాగో ఇప్పటికీ తెలియదట. సినీ నటిగా ఇన్నేళ్ల కెరీర్ పూర్తయినా.. ఇప్పటికీ ఎమోషనల్ సీన్‌లో కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తే.. ఆమె గ్లిజరిన్ వాడి ఆ సీన్ షూటింగ్ పూర్తి చేస్తుందట. ఈ విషయాన్ని టబునే స్వయంగా వెల్లడించింది.

బాలీవుడ్ ప్రముఖులు షబానా ఆజ్మీ, జావేద్ అఖ్తర్, ఫరాన్ అక్తర్, బాబా ఆజ్మీ, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్ తదితరులు అంతా టబుకు సమీప బంధువులే. టబు సోదరి ఫరా నాజ్ కూడా సినీ నటినే. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link