Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు మధ్య ఉన్న విచిత్ర బంధం ఏంటో తెలుసా?

Sat, 05 Oct 2024-7:52 am,

Superstar Krishna and Underworld Don Dawood Ibrahim's: 1980వ దశకంలో అప్పటి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన హీరోయిన్లలో మందాకిని ఒకరు. బాలీవుడ్ లో 1985 వ సంవత్సరం రామ్ తేరీ గంగా మైలి సినిమా ద్వారా అడుగుపెట్టిన మందాకిని తన బోల్డ్ యాక్టింగ్ తో అందరినీ కట్టిపడేసింది. నీలిరంగు కళ్ళతో ఆ తరం యువ హృదయాలను కొల్లగొట్టింది. బాలీవుడ్ లో అప్పటి సూపర్ స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన మిథున్ చక్రవర్తి, గోవిందా, సంజయ్ దత్, రిషికపూర్ సరసన నటించింది.

 ఇక తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ నటించి, దర్శకత్వం వహించిన సింహాసనం సినిమాలో మందాకిని తలుక్కున మెరిసింది. అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన భార్గవ రాముడు సినిమాల్లో సైతం మందాకిని మెరిసింది అయితే ఈ అమ్మడు సినిమాల్లో ఎంత క్రేజ్ సంపాదించుకుందో అదే స్థాయిలో వివాదాలను సైతం మూటగట్టుకుంది.  

 ఎందుకంటే 80, 90వ దశకంలో ముంబైలోని అండర్ వరల్డ్ మాఫియాకు చెందిన వ్యక్తులతో మందాకిని డీలింగ్స్ ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. భారత్లో మోస్ట్ వాంటెడ్ ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సైతం మందాకిని చట్టా పట్టాలు వేసుకొని తిరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు వీరిద్దరికీ మధ్య వివాహం సైతం జరిగిందని పలు మ్యాగజైన్లలో వార్తలు వచ్చాయి.  

 కానీ మందాకిని మాత్రం ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమేనని తనకు దావూద్ ఇబ్రహీంతో ఎలాంటి సంబంధం లేదని ఖండించారు. అయినప్పటికీ దుబాయిలో దావూద్ తో కలిసి ఉన్న ఆమె ఫోటోలు మాత్రం తెగ వైరల్ అయ్యాయి. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం మందాకిని ఎలా ఉంది ఏం చేస్తుంది? ఎలా స్థిరపడింది అనే సందేహం మీకు రావచ్చు. అయితే ప్రస్తుతం ఆరుపదుల వయసు దాటిన మందాకిని తన కెరీర్ మధ్యలోనే వదిలేసి డిబేట్ కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా శిష్యుడైన ఓ డాక్టర్ ను వివాహం చేసుకుంది.  

 ఆమెకు ఇద్దరు సంతానం. ప్రస్తుతం మందాకిని ఒక యోగా ట్రైనర్ గా ఉన్నారు దలైలామా శిష్యురాలిగా కొనసాగుతోంది. వీరికి ఒక హెర్బల్ స్టోర్ కూడా ఉంది. సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన మందాకిని ప్రస్తుతం ప్రశాంతమైన జీవనం కొనసాగిస్తుంది.   

బాలీవుడ్ లెజెండ్ డైరెక్టర్ యాక్టర్ రాజ్ కపూర్ నిర్మించిన రామ్ తేరీ గంగా మైలీ సినిమా ద్వారా పరిచయమైన మందాకిని అటు సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం సినిమాలో సైతం నటించి బాలీవుడ్ టాలీవుడ్ లో తన అభిమానులను సంపాదించుకుంది. అయితే దావూద్ ఇబ్రహీం తో ఆమెకు ఉన్న సంబంధం కారణంగా చాలా సంవత్సరాలు ఆమె పేరు చీకటి ప్రపంచంతో ముడిపడి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.  

 అయితే తెలుగు నాట అప్పటి పత్రికల్లో మందాకిని గురించి ప్రస్తావిస్తూ సూపర్ స్టార్ కృష్ణ సరసన నటించిన హీరోయిన్ గా పేర్కొని ఆమెకు దావూద్ ఇబ్రహీంతో వివాహం జరిగిందంటూ కొన్ని గాసిప్స్ వచ్చాయి. ఇలా సూపర్ స్టార్ కృష్ణతో దావూద్ ఇబ్రహీం కు రిలేట్ చేస్తూ కొన్ని విచిత్రమైన కథనాలు అప్పట్లో వడ్డించారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link