International Yoga Day 2023: యోగా ప్రాముఖ్యత ఎలా పెరిగిందో తెలుసా? ఇతర దేశాలు కూడా యోగాను అనుసరించడానికి కారణాలు..

Wed, 21 Jun 2023-9:51 am,

అంతకుముందు చాలా దేశాలు భారతీయులు చేసే యోగాని చూసి ఎగతాళి చేసేవి. ప్రస్తుతం యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, మనసుకు లభించే ప్రశాంతతను తెలుసుకొని ఎగతాళి చేసిన దేశాలే ప్రస్తుతం యోగాన్ని ఆదరిస్తున్నాయి. అంటే యోగ ప్రాముఖ్యత, ప్రయోజనాలు ఎంత ప్రాచుర్యం పొందాయో మీకు అర్థమై ఉంటాయి.  

పతాంజలిలో చాలా రకాల యోగాసనాలన గురించి క్లుప్తంగా వివరించారు. ముఖ్యంగా పతాంజలి పేర్కొన్న మనసు నియంత్రణ వ్యవస్థ అందరికీ తెలిసిందే. దీనిని రాజయోగమని కూడా అంటారు. ఈ పతాంజలి యోగా సూత్రాలన్నీ రాజయోగంపై ఆధారపడి ఉంటాయి. 

యోగా చేయడం వల్ల ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వచ్చే శ్వాసకోశ సమస్యలు సులభంగా దూరమవుతాయని యోగాన్ని పనులు చెబుతున్నారు. తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా యోగాసనాలు వేయాల్సి ఉంటుంది.  

శాసన బలంగా తీసుకొని బలంగా వదలడం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా గుండెలోని ధమనుల్లో వచ్చే సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది రక్త ప్రసరణ వ్యవస్థతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.  

ఒత్తిడిని తగ్గించేందుకు యోగ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా పతాంజలిలో పేర్కొన్న పలు యోగాసనాలను వేయాల్సి ఉంటుంది. ఈ ఆసనాలు వేయడం వల్ల ఏకాగ్రత కూడా లభిస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link