Boost Internet: ఇంట్లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుందా, ఈ టిప్స్ పాటించి చూడండి
వైఫై రౌటర్ ఎప్పుడూ ఇంట్లో మధ్యలో ఉంచాలి. అది కూడా ఎత్తైన ప్రదేశంలో అమర్చాలి. తద్వారా ఇళ్లంతా సమానంగా వైఫై అందుతుంది.
వైఫై రౌటర్ కోసం ఎప్పుడూ బిజీ తక్కువ ఉండే ఛానెల్ ఎంపిక చేసుకోవాలి. వైఫై ఎనలైజర్ యాప్ సహాయంతో అందుబాటులో ఏయే ఛానెల్స్ ఉన్నాయో చూడవచ్చు.
2.4 గిగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఉపయోగిస్తుంటే..5 గిగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌కు స్విచ్ కావల్సి ఉంటుంది.
వైఫై రౌటర్ కోసం లేటెస్ట్ Firmware ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీనివల్ల వైఫై సురక్షితంగా ఉంటుంది.
ముందుగా వైఫై రౌటర్‌ను రీస్టార్ట్ చేయాలి. దీనివల్ల వైఫై రౌటర్ క్రాష్ శుభ్రమౌతుంది. రౌటర్ వేగం పెంచవచ్చు. అంతేకాకుండా వైఫై ఎక్స్‌టెండర్ లేదా పవర్ లైన్ అడాప్టర్ సహాయంతో వేగం పెంచవచ్చు.