Gold Scheme: డబ్బులు ఊరికేరావు..ప్రతినెలా గోల్డ్ డిపాజిట్ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే లాభమేనా?

Thu, 07 Nov 2024-3:22 pm,

Gold Savings Scheme : బంగారానికి ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. బంగారానికి భారతీయులకు విడదీయారని బంధం ఉంది. ముఖ్యంగా మహిళలు అయితే బంగారు ఆభరణాలు లేనిది ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు వెళ్లలేని పరిస్థితి. అంటే మన దేశంలో బంగారానికి ఉన్న సెంటిమెంట్ ఏంటో అర్థం అవుతుంది. అయితే చాలా మంది బంగారం ఒకేసారి కొనుగోలు చేయలేరు. నగదు ఇబ్బంది లేనివారు ఒకసారి కొంటుంటారు. ఒకేసారి డబ్బులు పెట్టి డబ్బులు కొనుగోలు చేయలేని వారు మాత్రం వాయిదా పద్థతుల్లో చేరి బంగారం ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి వారే గోల్డ్ జ్యువెల్లరీ స్కీంలకు ఎక్కువ ఆకర్షితులవుతారు. ఇలాంటి బంగారు ఆభరణాల స్కీంల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

సాధారణంగా గోల్డ్ సేవింగ్, డిపాజిట్ స్కీమ్స్ 12 నెలల వ్యవధిలో ప్రతినెలా ఈఎంఐ చెల్లించి ఆభరణాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో సాధారణ బంగారం షాపులు కూడా బంగారం ఆభరణాల స్కీములను ఆఫర్ చేస్తున్నాయి. చాలా దుకాణాలు ఈస్కీములో 12 నెలల వరకు నగదును డిపాజిట్ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. 

ప్రస్తుతం మార్కెట్లో సాధారణ బంగారం షాపులు కూడా గోల్డ్ జ్యువెల్లరీ స్కీములను ఆఫర్ చేస్తున్నాయి. చాలా షాపుల్లో ఈ స్కీములో 12నెలల వరకు నగదును డిపాజిట్ చేసే ఛాన్స్ కల్పిస్తున్నాయి. 12నెలల తర్వాత మీరు జమ చేసిన నగదు మొత్తానికి సరిపడా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే ఛాన్స్ ఈ స్కీం కల్పిస్తుంది. ఈ 12 నెలల వాయిదాలు చెల్లించినందుకు కొనుగోలు చేసిన జ్యువెల్లరీపై తరుగును లేదా తయారు ఛార్జీలను తీసివేస్తారు లేదంటే తగ్గించే అవకాశం ఉంటుంది.   

అయితే కొన్ని షాపులు మాత్రం 11 వాయిదాలు మనం చెల్లిస్తేనే...12వ వాయిదా మొత్తాన్ని వారే చెల్లిస్తారు. తర్వాత 12 నెలల మొత్తానికి సరిపడా ఆభరణం ఆషాపు దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని షాపులు వినియోగదారులు చెల్లించే నగదును ఆ రోజు నాటికి ఎంత బంగారం లభిస్తుందో దానికి విలువకట్టి రికార్డ్ చేస్తారు. వాయిదాలు పూర్తయిన తర్వాత ఏడాది తర్వాత అప్పటి వరకు ఎన్ని గ్రాములో లెక్కించి బంగారు ఆభరనాలను డిపాజిట్ దారునికి అందిస్తారు. బంగారం ధర చాలా ఏళ్ల నుంచి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి స్కీములు కూడా వినియోగదారులను ఆకర్షిస్తుంటాయి. 

సాధారణంగా రోజువారీ బంగారం ధరను తెలుసుకోవడం వినియోగదారుడికి పెద్ద కష్టమేమీ కాదు. షాపులు కూడా ప్రతిరోజు బంగారం ధరను తెలియజేసే బోర్డును పెడుతుంటాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్ అసోసియేషన్ కు చెందిన 89556 64433 నెంబర్కు మిస్డ్ కాల్ చేస్తే సరిపోతుంది. ఆ రోజు బంగారం ధర తెలిసిపోతుంది. https://www.ibja.co వెబ్ సైట్లో కూడా ధరలను తెలుసుకోవచ్చు. అయితే బంగారం ధర ఇంత బహిరంగంగా ఉన్నప్పుడు షాపు యజమానికి ఈ స్కీం వల్ల ప్రయోజనం ఏంటని వినియోగదారులు డౌట్ రావడం సహజమే.   

బంగారం ధరతోపాటు మేకింగ్ ఛార్జీలు, తరుగు వంటి అదనపు ఖర్చులు వినియోగదారులకు వర్తిస్తాయి. మేకింగ్ ఛార్జీ, తరుగు ప్రతి ఆభరణానికి ఒకే రకంగా ఉండదు. మారుతూ ఉంటుంది. గరిష్టంగా షాపు యజమానికి లాభం కలిగేది కూడా ఇక్కడే అన్న విషయం వినియోగదారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి. స్కీములో జీరో వేస్టేజీ, మేకింగ్ ఛార్జీలు కూడా కొన్ని డిజైన్లు, మోడల్స్ కు మాత్రమే ఉంటాయి. మీరు స్కీములో అవి కొనేందుకు ఆసక్తి చూపనట్లయితే ఇలాంటి ఛార్జీలను కూడా చెల్లించాల్సి వస్తుంది.   

వినియోగదారులు ఈ స్కీం అందించే అదే దుకాణం దగ్గర ఆభరణాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ ను డబ్బు రూపంలో తిరిగి ఇవ్వరు. ఆభరణాల రూపంలో మాత్రమే ఉంటుంది. వినియోగదారులకు బంగారం కొనుగోలు చేసేటప్పుడు స్వచ్చత, తరుగు, మేకింగ్ ఛార్జీలు వంటి వాటిపై స్పష్టమైన అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ఆభరణాన్ని తీసుకునేటప్పుడు బీఐఎస్ హాల్ మార్క్ గత బంగారు ఆభరణాన్ని మాత్రమే కొనాలి. బంగారు ఆభరణం సాధారణంగా 22 క్యారెట్లు అయి ఉంటుంది. ఒక గ్రాము బంగారంపై 2 క్యారెట్లు తగ్గినా ధరలో ఎంతో వ్యత్యాసం వస్తుంది. కాబట్టి మీరు తీసుకుంటున్న బంగారం ఎన్ని క్యారెట్లు అనేది స్పష్టం తెలుసుకోవాలి. ఇది తెలియకుంటే భారీగా నష్టపోతారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link