Iphone 15 Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో Apple 15 మొబైల్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఎగబడి కొనుగోలు చేస్తున్న జనాలు..
ఫ్లిఫ్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ సేవింగ్ సేల్స్‌లో భాగంగా ఇటీవల మార్కెట్లోకి లాంచ్ అయిన, యాపిల్ 15 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ మొబైల్ పై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ లభించడం కాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో యాపిల్ 15 మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు ఐదు కలర్లలో లభిస్తోంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ అస్సలు MRP ధర రూ. 79,999కాగా ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తున్న సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ లభించబోతోంది.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పుడే యాపిల్ 15 మొబైల్ కొనుగోలు చేస్తే MRP ధర పై దాదాపు 11% వరకు తగ్గింపు లభిస్తుంది దీంతో ఈ మొబైల్ కేవలం రూ. 70,999కే పొందవచ్చు.
ఈ యాపిల్ ఐఫోన్ 15 పై మరింత తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు ఈ ఆఫర్స్ వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఫ్లిఫ్‌కార్ట్ ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది.
ఫ్లిఫ్‌కార్ట్‌లో ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాలు లోకి వెళితే.. ఈ మొబైల్‌ని కొనుగోలు చేసే క్రమంలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి బిల్లు చెల్లిస్తే రూ. 4,000 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ మొబైల్ పై మరింత తగ్గింపు పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్ ప్లస్ మెంబర్షిప్ కలిగి ఉన్న వారు ఈ మొబైల్ ఆర్డర్ చేసుకునే క్రమంలో ఎక్స్చేంజ్ ఆఫర్లు వినియోగిస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది.