IPL 2022 mega auction: ఐపీఎల్ మెగా వేలంలో అత్యధిక ధర పలికిన టాప్​ 10 ప్లేయర్స్ వీళ్లే..

Mon, 14 Feb 2022-12:51 pm,

రెండు రోజుల వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇషాన్ కిషన్​ నిలిచాడు. ముంబయి ఇండియన్స్ (ఎంఐ) జట్టు ఇషాన్​ కిషన్​ను రూ.15.25 కోట్లు ఖర్చు చేసి దక్కించుకుంది.

టీమ్​ ఇండియా ఆల్​ రౌండర్ దీపక్ చాహర్​ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్​కే)​ రూ.14 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కాపాడుకుంది.

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్​ శ్రేయస్​ అయ్యర్​ను ఇసారి కోల్​కతా నైట్​ రైడర్స్ దక్కించుకుంది. అయ్యర్​ను రూ.12.5 కోట్లు వెచ్చించింది కేకేఆర్​.

ఇంగ్లాండ్ ఆల్​ రౌండర్​ లియామ్ లివింగ్​ స్టోన్​ను రికార్డు ధరకు కొనుగోలు చేసింది పంజాబ్​ కింగ్స్​. అతడి కోసం రూ.11.5 కోట్లు ఖర్చు చేసింది. రెండో రోజు వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ లివింగ్​ స్టోన్ కావడం గమనార్హం.

టీమ్ ఇండియా ఆల్​రౌండర్ శార్దుల్ ఠాకూర్​ను ఆర్​సీబీ కొనుగోలు చేసింది. ఠాకూర్​ కోసం రూ.10.75 కోట్లు వెచ్చించింది.

ఆల్​ రౌండర్ హర్షల్​ పటేల్​ ఈ సారి రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. ఆర్​సీబీ హర్షల్​ పటేల్​ను రూ.10.75 కోట్లతో కనుగోలు చేసింది.

శ్రీలంక ఆల్​ రౌండర్​ వానిండు హసరంగాను మళ్లీ రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. హసరంగ కోసం రూ.10.75 కోట్లు వెచ్చించింది ఆర్​సీబీ.

వెస్టిండిస్​ వన్డె ఫార్మాట్ కెప్టెన్​ నికోలస్​ పురాన్​ను హైదరాబాద్ దక్కించుకుంది. పూరాన్​ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది ఎస్​ఆర్​హెచ్​.

న్యూజిలాండ్​ బౌలర్​ లాకి ఫెర్గూసన్​ను రూ.10 కోట్లకు దక్కించుకుంది కొత్త టీమ్​ గుజరాత్​ టైటాన్స్​. ఇంతకు ముందు ఫెర్గుసన్​ కేకేఆర్​ తరఫున ఆడాడు.

టీమ్ ఇండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ భారీ ధర పలికాడు. ప్రసిద్ధ్​ను రాజస్థాన్ రాయల్స్ (ఆర్​ఆర్​)​ రూ.10 కోట్లకు దక్కించుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link