CSK Vs GT: బిగ్‌ఫైట్‌కు రెడీ.. ఈ ప్లేయర్లపై ప్రత్యేక దృష్టి
అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న ఎంఎస్ ధోనికి ఇది చివరి సీజన్ అని ప్రచారం జరుగుతోంది. లాస్ట్ సీజన్‌లో ధోని ఎలా ఆడతాడని కచ్చితంగా అందరి చూపు ఉంటుంది.
హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్‌ను మొదటిసారి ఛాంపియన్‌గా నిలిపాడు. ఇటీవల టీమిండియా కెప్టెన్‌గానూ తన సత్తా నిరూపించుకున్నాడు. పాండ్యా కెప్టెన్సీతోపాటు బ్యాటింగ్, బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి ఉంటుంది.
బెన్ స్టోక్స్ తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్‌లో స్టోక్స్, ధోనీతో కలిసి ఆడడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఇద్దరూ రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ తరఫున కలిసి ఆడారు. ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఎలా ఆడతానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గత కొన్నేళ్లుగా మ్యాచ్ ఫినిషర్‌గా.. ఆల్‌రౌండర్‌గా నిలకడగా రాణిస్తున్న రాహుల్ తెవాటియా తొలి మ్యాచ్‌లోనే చెలరేగే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం మూడు ఫార్మాట్‌లలో స్థానం కోల్పోయిన అజింక్య రహానేకు ఐపీఎల్ కీలకంగా మారింది. మళ్లీ సత్తా నిరూపించుకుని సెలెక్టర్లలో దృష్టిలో పడాలని చూస్తున్నాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో రహానేకి కచ్చితంగా చోటు దక్కుతుందని భావిస్తున్నారు.
2020 నుంచి ఐపీఎల్‌కు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మకు గుజరాత్ టైటాన్స్ నుంచి మరోసారి అవకాశం లభించింది. ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇస్తున్న మోహిత్ శర్మ ఎలా బౌలింగ్ చేస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.