IPL 2023 Records: ఒకే టీమ్‌పై అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్లు వీళ్లే..!
15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 77 సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (6) రికార్డు సృష్టించగా.. ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ నిలిచాడు.
మొత్తం 227 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 129.65 స్ట్రైక్ రేట్‌తో 6838 పరుగులతో టాప్ ప్లేయర్‌గా ఉన్నాడు. తొమ్మిదో ఎడిషన్‌లో కోహ్లీ సృష్టించిన విధ్వంసం అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేరు. 16 మ్యాచ్‌లలో 152.03 స్ట్రైక్ రేట్‌తో 973 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా నాలుగు సెంచరీలు ఉన్నాయి. 2016 సీజన్‌లో గుజరాత్ లయన్స్‌పై రెండు సెంచరీలు బాదాడు.
ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ ప్లేయర్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. 167 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. నాలుగు సెంచరీలతో సాయంతో 6109 పరుగులు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రెండు సెంచరీలను కొట్టాడు. మొదటి సెంచరీ 2010 సీజన్‌లో 69 బంతుల్లో 107 రన్స్ చేయగా.. 2017లో 59 బంతుల్లో 126 పరుగులు చేసి మరో శతకం అందుకున్నాడు.
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పిచ్ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా బంతిని స్టాండ్స్‌కు పంపించడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తాడు. 463 టీ20 మ్యాచ్‌ల్లో 144.75 స్ట్రైక్ రేట్‌తో 14,562 రన్స్ చేశాడు. ఐపీఎల్‌లో కూడా గేల్ తనదైన ముద్ర వేశాడు. టోర్నీలో అందరీ కంటే ఎక్కువగా ఆరు శతకాలు బాదాడు. పంజాబ్ కింగ్స్ జట్టుపై 2011, 2015 సీజన్లలో సెంచరీలు చేశాడు.
ప్రస్తుత లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేశాడు. 114 మ్యాచ్‌ల్లో 135.16 స్ట్రైక్ రేట్‌తో 4044 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్‌పై ఏకంగా మూడు శతకాలు బాదగా.. మరో సెంచరీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై చేశాడు.