IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలంలో ఈ ఐదుగురు భారతీయ ఆటగాళ్లపై అందరి దృష్టి
శివమ్ మావి
అండర్ 19 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన తరువాత శివమ్ దూబేను కేకేఆర్ 3 కోట్లకు ఖరీదు చేసింది. 2018లో కేకేఆర్ డెబ్యూ చేశాడు. 5 వికెట్లు పడగొట్టాడు. ఆరు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం ఇతడు 50 లక్షల బేస్ ప్రైస్‌తో ఉన్నాడు.
శార్దూల్ ఠాకూర్
టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను కేకేఆర్ విడుదల చేసింది. 2023 సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 1 హాఫ్ సెంచరీతో 113 పరుగులు చేశాడు. 7 వికెట్లు పడగొట్టాడు. ఇతడి బేస్ ప్రైస్ 2 కోట్ల రూపాయలుగా ఉంది.
మనీష్ పాండే
ఐపీఎల్ 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడి దెక్కన్ ఛార్జర్స్ జట్టుపై 114 పరుగులతో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఇప్పటి వరకూ ఆర్సీబీ, పూణే వారియర్స్, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. ప్రస్తుతం 50 లక్షల బేస్ ప్రైస్‌తో ఉన్నాడు.
హర్షల్ పటేల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 2022 సీజన్‌లో 10.75 కోట్లకు విక్రయమైన ఆటగాడు. హర్యానాకు చెందిన ఈ పేసర్ ఆర్సీబీ తరపున ఆడి 19 వికెట్లు తీశాడు. 2023 సీజన్‌లో 14 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ మాత్రం 9.65గా ఉంది. ఆర్సీబీ ఇతడిని రిలీజ్ చేయడంతో ఇప్పుడు 2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఉన్నాడు.
చేతన్ సకారియా
2021 నుంచి లీగ్‌లో ఆడుతున్న యువ పేసర్ చేతన్ సకారియా గత సీజన్‌లో 2 మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. 2022లో 3 మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు సాధించాడు. 2021లో టీమ్ ఇండియా తరపున డెబ్యూ చేశాడు. కానీ ఇప్పటి వరకూ 1 వన్డే, 2 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.