Virat Kohli: ఆర్‌సీబీకి ఫుల్ జోష్.. మళ్లీ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ?
Virat Kohli: ఆర్‌సీబీకి ఫుల్ జోష్.. మళ్లీ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ?
మూడుసార్లు రన్నరప్: ఐపీల్ 2008లో ప్రారంభమైన నాటి నుంచి ఆర్‌సీబీ మూడు సార్లు ఫైనల్‌కు చేరినా ట్రోఫీని మాత్రం అందుకోకుండా వెనుదిరిగింది. వారి కష్టానికి అదృష్టం తోడు కాకపోవడంతో ట్రోఫీ దక్కడం లేదని క్రికెట్ ప్రియులు జాలి కనబరుస్తుంటారు.
సరికొత్త వ్యూహం: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వచ్చే సీజన్‌కు సరికొత్త వ్యూహంతో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని తిరిగి కెప్టెన్‌గా నియమించుకోవాలని ఆర్‌సీబీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
కెప్టెన్‌గా కోహ్లీ: ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి 2013 నుంచి 2021 వరకు విరాట్ కోహ్లీ కెప్టెన్ పాత్రను పోషించాడు. తర్వాతి సీజన్‌లో బాధ్యతల నుంచి వైదొలగగా డుప్లెసిస్ కెప్టెన్‌గా వచ్చాడు.
కలసిరాని అదృష్టం: ఆటగాడిగా విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నా జట్టు మాత్రం ట్రోఫీని దక్కించుకునే అదృష్టం రావడం లేదు.
కప్ నమ్‌దే కోసం: రన్నరప్‌గా నిలుస్తున్న జట్టును విన్నర్‌గా చేసుకునేందుకు ఆర్‌సీబీ యాజమాన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగా కోహ్లీని బాగా వాడుకోవాలని యాజమాన్యం నిర్ణయించినట్లు సమాచారం.
కోహ్లీ రికార్డులు: ఐపీఎల్ కెరీర్‌లో విరాట్ కోహ్లీ 252 మ్యాచ్‌లు ఆడి 131.97 స్ట్రైక్ రేటుతో 8004 పరుగులు చేశాడు. వాటిలో 8 శతకాలు, 55 అర్థ సెంచరీలు ఉండడం విశేషం.
అంగీకరిస్తాడా?: మరోసారి కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ అంగీకరించి బాధ్యతలు చేపడుతాడా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
భారీ ప్రణాళిక: రిటైనింగ్, రాబోయే మెగా వేలం కోసం ఆర్‌సీబీ యాజమాన్యం ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.