IPL 2023 Records: బంతి పడితే బాదేయడమే.. బౌలర్లను ఉతికారేస్తున్న బ్యాట్స్‌మెన్లు
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ సీజన్‌లో సరికొత్తగా కనిపిస్తున్నాడు. చివర్లో బ్యాటింగ్‌కు వస్తూ.. తక్కువ బంతుల్లోనే పరుగుల వరద పారిస్తున్నాడు. గత మ్యాచ్‌లో ఢిల్లీపై 9 బంతుల్లో 20 పరుగులు చేయడంతో ఈ సీజన్‌లో స్ట్రైక్-రేట్ 204.25కి చేరుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఈ సీజన్‌లో కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. అయితే చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 7 బంతుల్లో 25 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతోపాటు అత్యుత్తమ స్ట్రైక్ రేట్ 253.84 నమోదు చేశాడు.
ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 186.13 స్ట్రైక్ రేట్‌తో 376 పరుగులు చేశాడు.
గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ రాహుల్ తెవాటియా ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 203.22 స్ట్రైక్ రేట్‌తో 63 పరుగులు చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 2023లో 11 మ్యాచ్‌లలో 186.44 స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లలో 215 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 185.34గా ఉంది.