Asia Cup 2023: ముంబై ఇండియన్స్ నుంచి ఆసియా కప్‌కు ఐదుగురు ఎంపిక.. ఏ టీమ్ నుంచి ఎవరు అంటే..?
ముంబై ఇండియన్స్ టీమ్ నుంచి ఆసియా కప్‌లో ఎక్కువ మంది సెలక్ట్ అయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్,పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిపి ఐదుగురు ముంబై ఇండియన్స్ టీమ్ ప్లేయర్లు ఉన్నారు.
గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యా, ఓపెనర్ శుభ్‌మన్ గిల్, పేసర్ మహమ్మద్ షమీ భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి భారత జట్టులో ఇద్దరు ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యారు.
ఆసియా కప్‌కు ఎంపికైన శ్రేయాస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ మహ్మద్ సిరాజ్ ఆసియా కప్‌కు ఎంపియ్యారు.
చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రవీంద్ర జడేజా ఆసియా కప్‌లో ఆడనున్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్‌కు నుంచి కేఎల్ రాహుల్ ఆసియా కప్‌లో ప్రాతినిధ్యం వహించనున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ ఆసియా కప్ జట్టులో ఒక్క ఆటగాడు మాత్రమే ఉన్నాడు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ వెన్ను గాయం నుంచి కోలుకున్న తర్వాత వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. సంజూ శాంసన్ బ్యాకప్ ప్లేయర్‌గా ఉన్నాడు.