Iqoo 13 Price: Iqoo సూపర్ ఫోన్ వస్తోంది.. ఇక సాంసంగ్, రియల్‌మీలకు బైబై.. ఫీచర్స్ ఇవే!
ఈ IQoo 13 అద్భుతమైన డిజైన్‌తో లాంచ్ కానుంది. అంతేకాకుండా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 144 FPS గేమ్ ఫ్రేమ్ ఇంటర్‌పోలేషన్‌తో విడుదల కానుంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ IP69 రేటింగ్ సపోర్ట్‌తో విడుదల కానుంది. ఇది 2K 144Hz అల్ట్రా ఐకేర్ డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన సెక్యూరిటీ అప్‌డేట్స్ వివరాల్లోకి వెళితే.. 5 సంవత్సరాల పాటు అందించే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఈ మొబైల్ బ్యాక్ సెటప్ వివరాల్లోకి వెళితే.. దీని బ్యాక్ సెటప్‌లో మూడు కెమెరా ఆప్షన్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులోని ప్రధాన కెమెరా సోనీ IMX 921 మెయిన్ లెన్స్‌ను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ కెమెరా వివరాల్లోకి వెళితే.. ఇందులో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అందుబాటులో రాబోతోంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 6000mAh బ్యాటరీతో విడుదల కానుంది.
ఈ IQoo 13 స్మార్ట్‌ఫోన్ స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిచేందుకు 120W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ మూడు కలర్ ఆప్షన్స్‌లో విడుదల కానుంది.