Iqoo 9 Pro: ప్రత్యేక తగ్గింపుతో ఆకర్షిస్తున్న Iqoo 9 Pro మొబైల్‌..రూ.21,000పైగా తగ్గింపు!

Tue, 22 Aug 2023-3:56 pm,

కంపెనీ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన iQOO 9 మొబైల్‌ ఫోన్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌తో తగ్గింపు ధరలకే విక్రయిస్తోంది. ఐకు వెబ్‌సైట్‌లో ఎక్స్‌ప్లోజివ్ క్వెస్ట్ డేస్ సేల్‌లో ఈ మొబైల్‌ ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది.

ప్రస్తుతం iQOO 9 స్మార్ట్‌ ఫోన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో రెండు వేరియంట్స్‌తో పాటు 4 కలర్స్‌లో అందుబాటుటో ఉంది. కంపెనీ ముందుగా ఈ స్మార్ట్ ఫోన్‌ను  రూ.49,990లకు విక్రయించింది. అయితే మిడ్‌ రేంజ్‌ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని 40 శాతం తగ్గింపును అందిస్తోంది. 

ఇప్పుడే  iQOO 9 స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేస్తే 40% తగ్గింపు పోను కేవలం రూ. 29,990లకే లభిస్తోంది. అయితే కంపెనీ విడుదల చేసిన తర్వాత ఈ స్మార్ట్ ఫోన్‌ ధర ఇంత తగ్గడం ఇదే మొదటిసారని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు.  

iQOO 9 మొబైల్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే నో-కాస్ట్ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ చాలా రకాల ఫీచర్స్‌తో మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ మొబైల్‌  6.56 అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 

ఇక iQOO 9 స్మార్ట్‌ ఫోన్‌ కెమెరా ఫీచర్స్‌ విషయానికొస్తే..ఈ మొబైల్‌ ఫోన్‌  48 మెగాపిక్సెల్ సోనీ IMX 598 గింబల్ బ్యాక్‌ కెమెరాతో వస్తోంది. దీంతో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link