Iqoo Z9S 5G Discount Offer: అమెజాన్‌లో iQOO Z9s 5G మొబైల్‌పై రూ.6 వేల డిస్కౌంట్.. ఎగబడి మరీ కొంటున్నారు!

Sun, 29 Sep 2024-7:24 pm,

ఇటీవల మార్కెట్లోకి లాంచ్ అయిన iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుంది. ఇది అద్భుతమైన ఫీచర్లతో ప్రీమియం కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా జంబో బ్యాటరీ సెట్ అప్ ని కలిగి ఉంటుంది. 

ప్రస్తుతం మార్కెట్లో ఈ  iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రెండు కలర్ ఆప్షన్స్ ను కలిగి ఉంటుంది. ఇందులోని మొదటి బేస్ వేరియంట్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది.   

ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర MRP రూ.25,999 కాగా దీనిని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా కొనుగోలు చేస్తే 23% వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను కేవలం రూ.19,998కే పొందవచ్చు. అదేవిధంగా దీనిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  

ఈ మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, దీనిని ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి దాదాపు రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ డిస్కౌంట్ ఆఫర్ ఫోను స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.17,999కే పొందవచ్చు.

అలాగే దీనిపై అదనంగా ప్రత్యేకమైన కూపన్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసే వారికి అత్యధిక డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అయితే ఈ కూపన్ వాడితే దాదాపు రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ కూపన్ డిస్కౌంట్ పోను కేవలం రూ. 17,498కే ఈ కొత్త మొబైల్ ను పొందవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link