IRCTC Arunachal Pradesh Tour: అరుణాచల్ ప్రదేశ్ అందాలు చూద్దామా? అతి తక్కువ ధరలో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే..!!

Sun, 04 Aug 2024-2:42 pm,

IRCTC Arunachal Tour Package: మీ కుటుంబంతో కలిసి ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్ళాలి అనుకుంటున్నారా? సంవత్సరం అంతా ఆఫీసులో వర్క్ ప్రెషర్ తో అలసిపోయిన మీరు రిఫ్రెష్మెంట్ కోసం లాంగ్ టూర్ ప్లాన్ చేసుకోవడం సహజమే. ఈ నేపథ్యంలో మీరు లాంగ్ టూర్ కోసం ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటున్నారా. అయితే మంచి హిల్ స్టేషన్ కు వెళ్తే మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఈశాన్య భారతదేశంలో పెద్ద ఎత్తున పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తోంది. 

ఇందులో భాగంగా భారతదేశంలో సూర్యుడి తొలి కిరణాలను అందుకునే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ప్రకృతి రమణీయతకు హిమాలయాల సొగసులకు అందమైన జలపాతాలకు ఈ రాష్ట్రం ఆలవాలం. అలాంటి అరుణాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం పర్యాటక రంగం ఊపందుకుంది. మీరు కూడా అరుణాచల్ ప్రదేశ్ అందాలను చూడాలి అనుకున్నట్లయితే, IRCTC వారు అందిస్తున్న టూర్ ప్యాకేజీ ద్వారా మీరు అరుణాచల్ ప్రదేశ్ అందాలను తిలకించవచ్చు. 

IRCTC పర్యాటకుల కోసం అరుణాచల్ ప్రదేశ్ ట్రావెల్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా తక్కువ ధరకే అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించారు. ముఖ్యంగా LTC మీద టూర్లకు వెళ్లే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టూర్ మీరు ప్రతి శుక్రవారం ప్రారంభమవుతుంది.  

 టూర్ ప్యాకేజీ ద్వారా, ప్రయాణికులు అరుణాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలను అతి తక్కువ ధరలకే చౌకగా సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర విషయాేనికి వస్తే దీని ధర రూ.34,310గా నిర్ణయించారు.. IRCTC  ఈ టూర్ ప్యాకేజీ న్యూ జలపాయిగురి నుండి ప్రారంభం అవుతుంది  ఈ టూర్ ప్యాకేజీలో, పర్యాటకులకు వసతి  ఆహార ఏర్పాట్లు ఇన్ క్లూడ్ అయి ఉన్నాయని గమనించాలి.

IRCTC  అరుణాచల్ టూర్ ప్యాకేజీలో పర్యాటకులు ఈశాన్య భారత దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన గౌహతి, తేజ్‌పూర్, కాజిరంగా, దిరంగ్  తవాంగ్‌లను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీని దేఖో అప్నా దేశ్ కింద ప్రవేశపెట్టారు. IRCTC  ఈ టూర్ ప్యాకేజీ పేరు అరుణాచల్ ఎక్స్‌పెడిషన్ బై రైల్ పేరిట నామకరణం చేశారు. 

ఇక ఈ టూర్ ప్యాకేజీ రైలు ప్రయాణం ద్వారా సాగుతుంది. ఈ టూర్ ప్యాకేజీ 7 రాత్రులు, 8 పగళ్లు ఉంటాయి. ఈ టూర్ ప్యాకేజీలో, పర్యాటకులు అరుణాచల్‌లోని ఈ ప్రదేశాలను అతి తక్కువ ధరలకే సందర్శించవచ్చు.టూర్ ప్యాకేజీలో పర్యాటకులకు ఆహారం, వసతి కల్పిస్తారు. పర్యాటకులు అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ద్వారా ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. మీరు 8595936716కు కాల్ చేయడం ద్వారా కూడా టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link