IRCTC Tour Package: భక్తులకు IRCTC బంపరాఫర్.. అతి తక్కువ బడ్జెట్ లో 5 జ్యోతిర్లింగాలతో పాటు షిరిడి దర్శనం..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) బిహార్ కు చెందిన భక్తులకు బంపరాఫర్ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో భాగంగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ప్రయాణించే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పిస్తోంది. ఈ ప్యాకేజీ 10 రాత్రులు మరియు 11 రోజులు పాటు ఉండబోతుంది.
ఈ ప్రయాణం ఆగష్టు 24, 2024న బీహార్‌లోని బెట్టియా నుండి ప్రారంభమై.. సెప్టెంబర్ 3, 2024న బెట్టియాకు తిరిగి రావడంతో ముగుస్తుంది.
ఈ ప్రయాణంలో బెట్టియా రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు రైలు ఎక్కాల్సి ఉంటుంది. అక్కడ నుంచి సగౌలి, రక్సాల్, సీతామర్హి, దర్భంగా, సమస్తిపూర్, ముజఫర్‌పూర్, హాజీపూర్, పాటలీ పుత్ర, అర్రా, బక్సర్, దిల్దార్ నగర్ మరియు దీన్ దయాల్ ఉపాధ్యాయ స్టేషన్‌ల గుండా ఈ రైలు ప్రయాణిస్తోంది. ప్రయాణికులు ఆయా రైల్వే స్టేషన్ లలో దిగొచ్చు.
టూర్ ప్యాకేజీ వివరాలు..
ప్యాకేజీ పేరు- భారత్ గౌరవ్ షిర్డీ & జ్యోతిర్లింగ యాత్ర బెట్టియా (EZBG17) ఈ యాత్ర- 11 రోజులు/10 రాత్రులు కొనసాగనుంది. ట్రావెలింగ్ మోడ్- భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు భోజన పథకం- ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనం బయలుదేరే తేదీ- ఆగస్టు 24, 2024 సీట్ల సంఖ్య – 780 (స్లీపర్‌లో 660 మరియు థర్డ్ ఏసీలో 120)
షిర్డీ: సాయి దర్శనం, శని శింగనాపూర్ ఆలయం
నాసిక్: త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం
ఈ ప్రదేశాలలో సందర్శిస్తారు-
ఉజ్జయిని: ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం
సోమనాథ్: సోమనాథ్ జ్యోతిర్లింగం
ద్వారక: ద్వారకాధీష్ ఆలయం మరియు నాగేశ్వర్ జ్యోతిర్లింగం
ఛార్జీ ఎంతంటే..?
మీరు ఎకానమీ కేటగిరీలో ప్రయాణిస్తే రూ. 20,899 చెల్లించాల్సి ఉంటుంది.
స్టాండర్డ్ కేటగిరీ ప్యాకేజీని తీసుకుంటే ఒక్కో వ్యక్తికి రూ.35,795 చెల్లించాలి
మీరు ఈ లింక్ నుండి ప్యాకేజీని తనిఖీ చేయవచ్చు- https://www.irctctourism.com/pacakage_description?packageCode=EZBG17