Lizard Vastu: ఇంట్లో బల్లి ఉంటే మంచిదా? చెడ్డదా? తప్పక తెలుసుకోవాలి!
జ్యోతిష్యం ప్రకారం బల్లి ఇంట్లో ఉంటే ఆ ఇంటిపై ఏ ప్రభావం చూపుతుంది? జ్యోతిష్య నిపుణులు ఏ సూచనలు ఇస్తున్నారు తెలుసుకుందాం. ఎందుకంటే కొంతమంది మన దేశంలో బల్లులను పూజించేవారు ఉన్నారు. వీటికి ఆలయాలు కూడా ఉన్నాయి.
బల్లిని చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అర్థం. అంతేకాదు ఉదయం లేవగానే బల్లిని చూస్తే మన పితృదేవతల దీవెనలు పొందినట్లే అని నమ్ముతారు.
బల్లి మీద పడ్డా, ఉదయం లేవగానే మనకు కనిపించినా ఏదో సూచనలు ఇస్తుంది అంటారు. అంతేకాదు బల్లులు కలలో కనిపించినా కూడా మనకు ఏదో సూచన ముందుగా ఇస్తుందని అర్థం. బల్లి నెత్తి మీద పడితే అనర్థం జరుగుతుందని అంటారు. బల్లి ఇంట్లో సంతోషాన్ని, సంపదను పెంచుతుందని నమ్ముతారు
ముఖ్యంగా దీపావళి రోజున మీ ఇంట్లో బల్లి ఉంటే ఆ సంవత్సరం పొడవునా లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంటి పూజగదిలో బల్లి కనిపిస్తే ఇంట్లో సుఖః శాంతులు వెల్లివిరుస్తాయి. అయితే, జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో మూడు బల్లులు ఒకేచోట కనిపించినా శుభప్రదంగా భావిస్తారు.
అయితే, ఇంటి వంటగదిలో బల్లులు తిరిగితే జాగ్రత్త పడండి. అది మనం వండుకునే ప్రదేశం కాబట్టి ఆహారపదార్థాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అన్నింటిపై కవర్ చేసుకోవాలి. జ్యోతిష్య ప్రకారం బల్లి శుభసూచకం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)