Radhika Sarathkumar: `నీకు సిగ్గు లేదా..?` నయనతార డేటింగ్ పై ధనుష్ ఫైర్.. బయటపెట్టిన రాధిక

Tue, 19 Nov 2024-10:17 am,

తాజాగా నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విడుదలై సెలబ్రిటీల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ డాక్యుమెంటరీ పై ధనుష్ చేస్తున్న విమర్శలు అందరినీ ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా  ధనుష్ నిర్మించిన నయనతార నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాలోని మూడు సెకండ్ల క్లిప్పు కోసం ధనుష్ రూ.10 కోట్ల డిమాండ్ చేయడం అందరూ ఫైర్ అవుతున్నారు.   

ముఖ్యంగా ధనుష్ తో  పనిచేసిన చాలామంది హీరోయిన్స్ నయనతారకు అండగా నిలుస్తూ..ధనుష్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ సీనియర్ బ్యూటీ రాధిక కూడా ధనుష్ పై  ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు నానుం రౌడీధాన్ సెట్స్ లో విగ్నేష్ శివన్ తో నయనతార డేటింగ్ చేయడంపై ధనుష్ ఎలా స్పందించాడు అనే విషయాన్ని కూడా ఆమె గుర్తు చేసుకుంది. 

నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ లో రాధికా శరత్ కుమార్ నానుం రౌడీ దాన్ నుండి ఒక విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇక్కడ లేడీ సూపర్ స్టార్ నిజానికి ప్రేమలో పడ్డారు. అలాగే చిత్ర దర్శకుడు విగ్నేష్ శివన్ తో డేటింగ్ చేయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని వారు ఎవరికీ తెలియకుండా గోప్యంగానే ఉంచారు. ముఖ్యంగా నయనతార - విగ్నేష్ ఒకరితో ఒకరు రహస్యంగానే డేటింగ్ చేస్తున్నారని గుర్తించిన ధనుష్ చాలా కోపంగా నాకు ఫోన్ చేశారు. 

“వెంటనే ధనుష్ నాకు ఫోన్ చేసి.. నీకు సిగ్గు లేదా? అక్క..అని అన్నాడు. నేను ఆశ్చర్యపోయి.. ఏం చెబుతున్నాడు అంటూ అయోమయంలో పడిపోయాను.  అసలు సెట్స్ లో ఏం జరుగుతుందో మీకు తెలియదా? విగ్నేష్, నయనతార డేటింగ్ లో ఉన్నారని మీకు తెలియదా..?” అని అడిగారు.   

ఏమిటి నువ్వు చెబుతున్నది.. నాకు తెలియదు అంటూ నేను అన్నాను. ఇక అలా నయనతార విగ్నేష్  డేటింగ్ చేసుకుంటున్న విషయంపై ధనుష్.. ఆ రోజే తనకు ఫోన్ చేసి ఇలాంటి మాటలు అన్నట్లు రాధిక గుర్తు చేసుకుంది. 

ఇకపోతే తాజాగా డాక్యుమెంటరీ విడుదల అవ్వగా ఈ డాక్యుమెంటరీ పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. నెటిజన్స్ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link