8th Pay Commission: జూన్ 4 లోక్‌సభ ఫలితాల తరువాత 8వ వేతనసంఘంపై గుడ్‌న్యూస్ రానుందా
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 8వ వేతన కమిషన్ తీసుకొచ్చినా అమలుకు రెండేళ్లు పడుతుంది. అంటే 2026లో 8వ వేతన సంఘం అమలులోకి వస్తుంది.
కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం వెంటనే 8వ వేతన సంఘాన్ని వెంటనే ప్రకటిస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకోసారి కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ప్రకారం ఈ ఏడాది 8వ వేతన సంఘం ఏర్పాటవుతుందన్న నమ్మకంతో ఉద్యోగులు ఉన్నారు.
ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా విషయాలపై స్పష్టత రావల్సి ఉంది. ఇందులో 8వ పే కమీషన్ ఏర్పాటు ప్రధానమైంది.
లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోనని దేశ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు అంతకంటే ఆసక్తితో చూస్తున్నారు.