Baba Vanga: 2025లో ప్రపంచం అంతమవుతుందా? బాబా వంగా భవిష్యవాణి మీరే చూడండి..
ప్రతి ఒక్కరూ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటారు. కానీ, ఏమి జరుగుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. ప్రపంచంలో అనేక జ్యోతిష్యులు ఉన్నారు. వారు చెప్పిన విషయాలు కొన్ని సార్లు నిజమవుతాయి. బాబా వంగా అలాంటి జ్యోతిష్యుల్లో ఒకరు. బాబా వంగా చేసిన భవిష్యవాణులు చాలా వరకు నిజమే అయ్యయట.
బల్గేరియాకు చెందిన బాబా వంగా 12 సంవత్సరాల వయస్సులో తన చూపును కోల్పోయారు. అయితే, ఆ తర్వాత ఆమె భవిష్యత్తు చూడగల శక్తిని పొందినట్లు అందరూ చెబుతారు. ఇలానే, బాబా వంగా భవిష్యత్తులో కొన్ని ప్రధానమైన సంఘటనల గురించి ముందుగానే చెప్పారు. అందులో చాలా వరకు నిజమయ్యాయి అని అందరూ నమ్ముతారు. ఇప్పుడు బాబా వంగా వచ్చే ఏడాదిలో ఏమి జరుగుతుందో భవిష్యవాణి చెప్పారు.
కొన్ని నెలలలోనే 2025 సంవత్సరం ప్రారంభం కానుంది. బాబా వంగా వచ్చే ఏడాదిలో జరిగే విషయాలపై పలు భయానక విషయాలు చెప్పారు. ఆమె భవిష్యవాణి ప్రకారం, 2025లో ప్రపంచం చివరికి చేరుతుందట. 2012లో ప్రపంచాంతం జరుగుతుందని కూడా భవిష్యవాణి చేసారు, కానీ అది నిజం కాలేదు. అయితే, బాబా వంగా ప్రకారం, 5079 సంవత్సరానికి మానవ జాతి భూమి నుండి అంతరించిపోతుంది.
ఇక 2025లో ప్రపంచం పెద్ద యుద్ధాలు, ఘర్షణలు ఎదురవుతాయట. ఐరోపాలో ఒక యుద్ధం జరుగుతుందని, ఐరోపా దేశాలు భారీ నష్టాలను ఎదుర్కొనవచ్చని బాబా వంగా చెప్పారు. 2025 నాటికి, ప్రపంచ జనాభా ఘర్షణల కారణంగా బాగా తగ్గిపోతుందని కూడా ఆమె భవిష్యవాణి లో ఉంది.
2025 తర్వాత భవిష్యత్తు భయంకరంగా ఉండబోతుందని, 2028లో మానవులు వీనస్‌కు వెళ్తారని, 2033లో పెద్ద ఎత్తున మంచు కరిగిపోతుందని, సముద్ర మట్టాలు పెరుగుతాయని చెప్పారు. సునామీలు వస్తాయని 2130లో మనుషులు, అన్యగ్రహవాసుల మధ్య పరిచయం జరగనుందని, 2170 నాటికి వాతావరణ మార్పుల కారణంగా భూమి నాశనమవుతుందని చెప్పారు.