Ivy Gourd: రోజుకు 2 దొండకాయలు నమిలి తింటే.. గుండె, పొట్ట, కొలెస్ట్రాల్ సమస్యలు జన్మలో రావు!
ప్రతిరోజు పచ్చి దొండకాయను తినడం వల్ల గుండె సమస్యలతో పాటు పొట్ట సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్, క్యాల్షియం ఇతర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.
ముఖ్యంగా మధుమేహం సమస్యతో బాధపడేవారు వారానికి ఒక రోజైన పచ్చి దొండకాయను తినడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలను సులభంగా నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షించుకోవచ్చు.
పచ్చి దొండకాయను ఉదయం పూట నమలి తినడం వల్ల పొట్టకు సంబంధించిన అన్ని వ్యాధుల నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం, గ్యాస్ట్రిక్, పొట్టలో నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది.
ఈ దొండకాయల్లో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సలాడ్స్‌లో వీటిని చేర్చుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.
పచ్చి దొండకాయల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వంటి లక్షణాలు ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల సులభంగా రోగనిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా ఉంటాయి.
ఈ దొండకాయల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె సమస్యల నుంచి కూడా విముక్తిగా కలిగిస్తాయి. దీంతోపాటు హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకరమైన సమస్యలు రాకుండా గుండెను రక్షిస్తాయి.