Jabardasth Sri Satya : పొట్టి డ్రెస్సులో జబర్దస్త్ బ్యూటీ.. కొత్త లుక్కులో సత్య శ్రీ అదుర్స్
జబర్దస్త్ బ్యూటీగా సత్య శ్రీకి మంచి క్రేజ్ ఉంది. ఒకప్పుడు జబర్దస్త్ స్టేజ్ మీద చమ్మక్ చంద్రతో కలిసి అతని స్కిట్లో దుమ్ములేపేస్తుండేది.
నాగబాబుతో పాటు చమ్మక్ చంద్ర బయటకు వెళ్లడం అందరికీ తెలిసిందే. తన గురువు చంద్ర బయటకు వెళ్లడంతో తాను కూడా వెళ్లానంటూ సత్య చెప్పుకొచ్చింది.
చమ్మక్ చంద్ర కొన్ని రోజులు అదిరింది, బొమ్మ అదిరింది, స్టార్ మాలోని కామెడీ స్టార్స్ అంటూ సందడి చేశాడు. అతనితో పాటు సత్య కూడా స్కిట్లో నటించింది.
సత్య ఇప్పుడు చమ్మక్ చంద్ర నుంచి దూరంగా వచ్చేసింది. ఏమైనా గొడవలు జరిగాయా? లేదా? అన్నది తెలియడం లేదు. కానీ సత్య మాత్రం మళ్లీ జబర్దస్త్ షోలోకి వచ్చింది.
జబర్దస్త్ బ్యూటీగా సత్య మళ్లీ సోషల్ మీడియాలో హవా చూపిస్తోంది. ఎప్పుడూ చీరకట్టులో కనిపించే సత్య ఇలా మోడ్రన్ దుస్తుల్లో దుమ్ములేపేస్తోంది.