Special FD Scheme: ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 180 రోజుల డిపాజిట్లపై భారీ వడ్డీ ఆఫర్.. లక్షకు ఎంత వడ్డీ వస్తుందంటే?
small finance bank : మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా. అయితే ఏ బ్యాంకులో వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉంటాయి. అయితే టెన్యూర్ ను భట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఇదే సమయంలో కొన్ని బ్యాంకులు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమును లాంచ్ చేస్తున్నాయి.
అయితే దీని కింద సాధారణ డిపాజిట్ పథకాలకు మించి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటాయి. ప్రముఖ బ్యాంకులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అదే సమయంల సాధారణ ప్రజలతో పోల్చినట్లయితే..ప్రైవేట్ బ్యాంకులు వడ్డీ కాస్త ఎక్కువగానే అందిస్తున్నాయి. వీటితో పోల్చితే చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో ఇంకా ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది.
ఇప్పుడు మనం ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులోనే ఎఫ్డీ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. అదే జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. ఈ బ్యాంకు ఇతర ప్రముఖ బ్యాంకుల బాటలోనే స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం లాంచ్ చేసింది. ఇతర బ్యాంకులు కనీసం ఏడాదికిపైనా టెన్యూర్ తో ప్రత్యేక పథకాలు లాంఛ్ చేస్తే..ఈ బ్యాంకు షార్ట్ టర్మ్ కే లిక్విడ్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ స్పెషల్ స్కీమ్ తీసుకువచ్చింది.
స్వల్పకాలానికి తమ దగ్గర ఉన్న పెద్ద మొత్తంలో నగదును ఈ స్పెషల్ డిపాజిట్ స్కీములో పెట్టుబడి చేయవచ్చని స్పష్టం చేసింది ఈ జనా బ్యాంకు. ఈ మేరకు సెప్టెంబర్ 19న ట్లోబ్యాంకు తన అధికారిక వెబ్ సై ఈ ప్రత్యేక స్కీముకు సంబంధించిన వివరాలను పొందుపర్చింది.
7 రోజుల నుంచి 180 రోజుల వ్యవధితో తెచ్చిన ఈ స్పెషల్ డిపాజిట్ స్కీమును లాంచ్ చేసింది. ఇతర బ్యాంకులు కనీసం ఏడాదికిపైన టెన్యూర్ తో ప్రత్యేక స్కీములను లాంచ్ చేస్తే ఈ బ్యాంకు షార్ట్ టర్మ్ కే లిక్విడ్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ స్పెషల్ స్కీమును తీసుకువచ్చింది.
రిటైల్ డిపాజిట్ల కింద కనిష్టంగా రూ. 10లక్షల నుంచి గరిష్టంగా రూ. 3కోట్ల వరకు ఈ స్పెషల్ ఎప్డీ స్కీములో పెట్టుబడి పెట్టవచ్చని చెబుతోంది. ఇక బల్క్ డిపాజిట్ల కింద కనీసం రూ. 3కోట్ల నుంచి గరిష్టంగా రూ.200కోట్ల వరకు పెట్టుబడులు పెట్టవచ్చని తెలిపింది. 7-180 రోజుల మధ్య మొత్తం 4 వేర్వేరు టెన్యూర్ ఉండగా..అన్నింటిపైనా 6.75శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
7 రోజుల నుంచి 14రోజులు, 15 రోజుల నుంచి 60 రోజులు, 61 నుంచి 90 రోజులు, 91 నుంచి 180 రోజులు టెన్యూర్లుతో చేగా ఉన్నాయి. ఇక ఇక్కడ కనీసం రూ. 10లక్షలు డిపాజిట్ చేస్తే 180 రోజులకు 6.75శాతం వడ్డీతికి రూ. 30,091 వడ్డీ వస్తుంది.