Posani: జనసేనానిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ నటుడు పోసానిపై కంప్లైంట్..
Posani: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా తెలుగు దేశం, జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు సోషల్ మీడియా వారియర్స్ ను అరెస్ట్ చేసింది.
మరోవైపు ఎన్నికల సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వారి కుటుంబ సభ్యుల పరువు తీస్తూ పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళి పై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు రాజమహేంద్రవరంలో ఎస్పీ నరసింహ కిషోర్ ను కలిసికంప్లైంట్ ఇచ్చారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వైపీసీ కీలక నేతగా ఉన్న పోసాని పలుమార్లు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా అసభ్య పదజాలంలో దూషించారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన విధంగా స్పందించలేదన్నారు. అంతేకాదు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీన మేషాలు లెక్కపెట్టారన్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ తో పాటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు.. సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులు పెట్టిన రవి కిరణ్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తెలుగు దేశం నేతలు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకొని న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు.
అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాములో కూడా పలువురు తెలుగు దేశం నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే.. అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం రాజకీయంగా విమర్శలు చేసినా.. భూతద్దంలో చూపెడుతూ తమ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం కక్ష్య సాధిస్తుందన్నారు.
మరోవైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఏపీలో పోలీస్ కంప్లైంట్ పైల్ అయింది. మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమంగా దుర్భాషలాడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని టార్గెట్ చేస్తూ దూసుకుపోతుంది.