Janhvi Kapoor: ‘దేవర’తో జాన్వీ కపూర్ కు ఏమైనా ఒరిగిందా..!

Wed, 02 Oct 2024-7:29 am,

ప్రస్తుతం అందరు ‘దేవర’ సినిమా గురించే చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో ‘దేవర’గా.. ‘వరద’గా తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు. అటు బైరాగా నటించిన సైఫ్  అలీ ఖాన్ కు ఈ చిత్రంలో మంచి రోల్ దక్కింది. కానీ తంగం గా నటించిన జాన్వీకి పెద్దగా ఒరిగిందేమి లేదు.

 

పైగా జాన్వీ ఫస్ట్ సీన్ లోనే ఆమె జలక్రీడలు ఆడుతున్న సీన్ తో పాటు ఎన్టీఆర్ అంటే ప్రేమ కాదు. కామం అనే రీతిలో సాగింది. ముందుగా ఈ చిత్రంలో రెండు పాటలను అనుకున్నారు. కానీ ఒక్క పాటకే పరిమితమైంది.

కేవలం జాన్వీ అంగాంగ ప్రదర్శనకే ఈ పాట అన్నట్టుగా సాగింది. కేవలం గ్లామర్ .. నార్త్ మార్కెట్ కోసం చేసిన ఈ ప్రయత్నం పెద్దగా ఫలించలేదనే చెప్పాలి. పైగా ఉత్తరాదిలో ఎన్టీఆర్ పేరుతోనే ఈ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి.

‘దేవర’ మొదటి పార్ట్ లో ఈమె క్యారెక్టర్ ను పూర్తిగా లేదు. రెండో పార్టులో జాన్వీ కపూర్ చెలరేగిపోతుందేమో చూడాలి. మొత్తంగా శ్రీదేవి కూతురు అనే ట్యాగ్ తప్పించి పెద్దగా మెప్పించలేదనే టాక్ వినిపించింది.

ఏది ఏమైనా ‘దేవర’ సినిమాతో జాన్వీ కపూర్ కు కూడా మంచి హిట్ దక్కిందనే చెప్పాలి. ఈమె కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. ఓ రకంగా సినిమాలో జాన్వీ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోయినా.. సౌత్ సినీ ఇండస్ట్రీలో లెగ్ పెడుతూనే మంచి హిట్ అందుకున్న భామగా అందరు గోల్డెన్ లెగ్ గా పిలవడం మొదలు పెట్టారు.

మరి రాబోయే రామ్ చరణ్ సినిమాతో కూడా అదే ఊపును జాన్వీ కపూర్  కంటిన్యూ చేస్తుందా లేదా అనేది చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link