Janhvi Kapoor: పొట్టి డ్రెస్‌లో కిరాక్ పుట్టిస్తోన్న `దేవర` భామ జాన్వీ కపూర్..
అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. ప్రస్తుం కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తోంది.
బాలీవుడ్‌లో 'ధడక్' మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా' మూవీతో పలకరించింది. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
తల్లి ఒకప్పటి లేడీ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీదేవి, తండ్రి బోనీ కపూర్ పెద్ద నిర్మాత.. బాబాయి అనిల్ కపూర్ ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ అయినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.
ఎన్టీఆర్‌తో చేస్తోన్న 'దేవర' మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో పాగా వేయాలని చూస్తోంది. ఈ సినిమా ఈ యేడాది అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రెండు పార్టులుగా తెరక్కుతోంది.
అటు ఎన్టీఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సన మూవీలో యాక్ట్ చేయబోతుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో జాన్వీ కపూర్ జాయిన్ కానుంది.
తాజాగా జాన్వీ కపూర్ అనంత్ అంబానీ పెళ్లి వేడుకులకు పొట్టి డ్రెస్‌లో వచ్చి అభిమానులను కనువిందు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
జాన్వీ కపూర్ ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ ఎపుడు వార్తల్లో ఉంటుంది.