Janhvi Kapoor: జాన్వీ కపూర్ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టడానికి కారణంగా అదేనా.. ?
అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ఆ తర్వాత తనకంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్పీడ్‌లో ఉంది.
బాలీవుడ్‌లో 'ధడక్' మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా' మూవీలో తొలి మహిళా ఫైటర్ పాత్రలో యాక్ట్ చేసి మెప్పించింది. ఈ సినిమా టాకీస్‌లలో కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
తల్లి ఒకప్పటి లేడీ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీదేవి, తండ్రి బోనీ కపూర్ పెద్ద నిర్మాత.. బాబాయి అనిల్ కపూర్ ఒకప్పటి బీ టౌన్ సూపర్ స్టార్ అయినా.. జాన్వీ ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.
ఎన్టీఆర్‌తో చేస్తోన్న 'దేవర' మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో పాగా వేయాలని చూస్తోంది. ఈ సినిమా ఈ యేడాది అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది.
అటు ఎన్టీఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సన మూవీలో యాక్ట్ చేస్తోంది. వరుసగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి యంగ్ హీరోలతో జోడి కట్టడంతో ఇక్కడ ఇండస్ట్రీపై ఫుల్ నజర్ పెట్టిందనే చెప్పాలి.
ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ ఎపుడు వార్తల్లో వ్యక్తిగా ఉంటుంది జాన్వీ కపూర్.