Janhvi Kapoor: పొట్టి గౌనులో జాన్వీ కపూర్ అందాల రచ్చ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ఆ తర్వాత తనకంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది.
ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్పీడ్‌లో ఉంది. ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లు అవుతున్న ఇప్పటికీ ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలేవి ఈ అమ్మడి ఖాతాలో లేవు.
హిందీలో 'ధడక్' మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా' మూవీలో తొలి మహిళా ఫైటర్ పాత్రలో నటించింది. ఈ సినిమా థియేట్రికల్‌గా కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
ఎన్టీఆర్‌తో చేస్తోన్న 'దేవర' సినిమాతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో పాగా వేయాలని చూస్తోంది. ఈ సినిమా ఈ ఇయర్ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది.
అటు ఎన్టీఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సన మూవీలో యాక్ట్ చేస్తోంది. వరుసగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి యంగ్ హీరోలతో జోడి కట్టడంతో ఇక్కడ ఇండస్ట్రీపై ఫుల్ నజర్ పెట్టిందనే చెప్పాలి.
తాజాగా జాన్వీ కపూర్ ప్రభాస్.. హను రాఘవపూడి సినిమాలో కథానాయిగా ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా పొట్టిగౌను కనిపించి అభిమానులకు కనువిందు చేసింది.