Janhvi Kapoor Half Saree Pics: లంగా ఓణీలో జాన్వీ కపూర్.. బాపు బొమ్మలా మెరిసిపోతుందిగా!

Wed, 05 Apr 2023-7:59 pm,

జాన్వీ కపూర్ తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో మెరిశారు. తిరుమలకు వచ్చిన జాన్వీ.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ ఫొటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.   

జాన్వీ కపూర్ సినిమా షూటింగ్‌ల‌తో ఎంత బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన సినిమా, వెకేషన్‌కు సంబందించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు.   

జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే మరోవైపు సౌత్‌పై కూడా ఫోకస్‌ పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 30లో నటిస్తున్నారు.  

జాన్వీ కపూర్ తన అందం, నటనతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.   

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా 'ధడక్' హిట్ కావడంతో జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి.     

1997 మార్చి 6న జాన్వీ కపూర్ ముంబైలో జన్మించారు. దివంగత హీరోయిన్ శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ గారాల పట్టే జాన్వీ. లాస్ ఏంజిల్స్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ మరియు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్లో చదివారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link