Jay Shah Journey: 15 ఏళ్లలో గుజరాత్ క్రికెట్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ వరకూ జై షా జర్నీ ఇదే

Tue, 27 Aug 2024-10:02 pm,

ఆసియా క్రికెట్ బాస్ కూడా

జై షా 2021లో ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ పదవి ఉంది. ఒకేసారి బీసీసీఐ, ఏసీసీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీసీసీఐలో డొమెస్టిక్ క్రికెట్‌కు సంబంధించి చాలా చర్యలు తీసుకున్నారు. ఫీజు పెంచడం, ప్రైజ్ మనీ ప్రకటన ఇలా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. 

2015లో బీసీసీఐలో ఎంట్రీ

బీసీసీఐలో జై షా 2015లో ప్రవేశించారు. బీసీసీఐ ఫైనాన్స్, మార్కెటింగ్ కమిటీలో స్థానం లభించింది. జై షా 2019 వరకు ఇదే పదవిలో ఉన్నారు. 2019లో బీసీసీఐ సెక్రటరీ అయ్యారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా ఉన్నారు

2009లో క్రికెట్ ఎంట్రీ

35 ఏళ్ల జై షా 2009లో క్రికెట్ ప్రపంచంలో అడుగెట్టారు. ఆటగాడిగా కాకుండా పాలకుడిగా అడుగెట్టారు. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్‌గా ఉన్నారు. 2013 వరకూ అదే పదవిలో ఉండి 2013-2015 వరకు జాయింట్ సెక్రటరీ బాధ్యతలు వహించారు

ఐసీసీలో ఇండియా ప్రాబల్యం

జై షా ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన 5వ భారతీయుడు. అంతకుముందు జగన్ మోహన్ దాల్మియా ( 1997-2000), శరద్ పవార్ ( 2010-2012), ఎన్ శ్రీనివాసన్ ( 2014-2015), శశాంక్ మనోహర్ ( 2015-2020) వరకూ బాధ్యతలు నిర్వహించారు

తండ్రి కేంద్ర హోంమంత్రి

గుజరాత్‌లో సెప్టెంబర్ 22వ తేదీ 1988లో జన్మించిన జై షా తండ్రి అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. బీజేపీ అగ్రనేత. గుజరాత్ నిర్మా యూనివర్శిటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. 2015లో వివాహమైంది

ఏకగ్రీవంగా ఎంపిక

ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్కలే మూడోసారి నామినేషన్ దాఖలు చేయలేదు. ఆ తరువాత జై షా ఏకైక అభ్యర్ధిగా నిలిచారు. దాంతో జై షా ఇతర దేశాల అభ్యర్ధనతో నామినేషన్ దాఖలు చేశారు. ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. జై షా పదవీ కాలం 2024 డిసెంబర్ 1న ప్రారంభం కానుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link