Prabhas Eshwar Movie : `ఈశ్వర్`కు ఇరవై ఏళ్లు.. ప్రభాస్ కృష్ణంరాజు రేర్ పిక్.. డార్లింగ్స్‌కు కిక్కే కిక్కు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జయంత్ సీ పరాన్జీ స్టైలీష్ టేకింగ్ బాగానే కలిసి వచ్చింది.
ఈశ్వర్ సినిమాకు మాస్ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ వచ్చింది. మాస్ సాంగ్స్, పాటలు, యాక్షన్ సీక్వెన్స్, ప్రభాస్ నటన ఇలా అన్నీ కూడా బీ, సీ సెంటర్లలో బాగానే వర్కౌట్ అయింది.
ఈశ్వర్ సినిమా అనుకున్నంతగా కమర్షియల్ సక్సెస్ అయితే అవ్వలేదు. కానీ ప్రభాస్ లాంచింగ్ సినిమా అవ్వడంతో ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. మాస్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేసిన ప్రభాస్.. ఈశ్వర్‌తో ఆ దిశగానే అడుగులు వేశాడు.
ఈశ్వర్ సినిమా వచ్చి నేటితో ఇరవై ఏళ్లు అవుతోంది. దీంతో నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు దర్శకుడు జయంత్ సీ పరాన్జీ.
ఈశ్వర్ ముహూర్తపు షాట్, సక్సెస్ సెలెబ్రేషన్స్, ఈశ్వర్ వర్కింగ్ స్టిల్స్‌ను జయంత్ షేర్ చేశాడు. ఇందులో ప్రభాస్‌తో పాటుగా కృష్ణం రాజు నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు.