Jhanvi Kapoor: శ్రీదేవిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. పింక్ శారీలో ఈ తరం అతిలోకసుందరి
Jhanvi Kapoor in Pink: శ్రీదేవి.. బోని కపూర్ ల కుమార్తె జాహ్నవి కపూర్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు దేవరా సినిమాతో పరిచయం కానుంది.
కాగా తన మొదటి సినిమా కూడా విడుదల కాకముందే జాన్వి కపూర్ కి మన తెలుగు రాష్ట్రాలలో అభిమానులు ఉన్నారు అన్నడం సందేహం లేదు.
ఇందుకు ముఖ్య కారణం జాన్వి కపూర్ శ్రీదేవి కూతురు కావడమే. అందుకే తన మొదటి చిత్రం తెలుగులో విడుదల కాకముందే ఇక్కడ కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ తన సోషల్ మీడియా ఫోటోల ద్వారా కూడా అందరిని మెప్పిస్తూ ఉంటుంది.
ఇక ఈమధ్య తన పింక్ సారీ ఫోటోలు చూస్తే మాత్రం.. జాన్వి కపూర్ అచ్చం తన తల్లి శ్రీదేవిలా మనకు కనిపించక మానదు. ఈ ఫోటోలు చూసి అందరూ జాహ్నవి కపూర్ ని ఈ తరం అతిలోకసుందరి అంటూ కామెంట్లు పెడుతున్నారు.