Jio: జియో కనీవినీ ఎరుగని బంపర్ ప్లాన్.. 11 నెలల వ్యాలిడిటీతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు బిగ్ షాకిస్తున్న దిగ్గజ కంపెనీ..
జియో టెలికాం సర్వీస్‌లో కస్టమర్లకు తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్లను అందిస్తోంది రూ.1899 తో రీఛార్జీ చేసుకుంటే ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. అంటే 11 నెలలు జియో వావ్ అనిపించే ఈ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి..
ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. 24 జీబీ డేటాతో బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్లాన్ ఇది. మళ్లీ మళ్లీ రీఛార్జీ చేసుకోకుండా ఈ ప్లాన్ యూజర్లు ఎంచుకోవచ్చు.
పెరిగిన టెలికాం ధరల తర్వాత చాలామంది బీఎస్ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యారు. అయితే, నెట్‌వర్క్ సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జియో కస్టమర్లను తమవైపుగా తిప్పుకునేందుకు ఈ ఆఫర్లను ప్రకటిస్తోంది.
ఈ 11 నెలల రీఛార్జీ ప్లాన్‌తో మీరు ఇతర లాభాలు కూడా పొందుతారు. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ కూడా వస్తుంది. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోటీగా జియో ఈ బెనిఫిట్స్‌తో ఆకట్టుకుంటోంది.
ఆగష్టునెలలో టెలికాం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. దాదాపు ఒక్కో కంపెనీ 20 శాతం వరకు కూడా ధరలను పెంచేశాయి. ఇది యూజర్లపై భారీ ప్రభావం చూపింది. చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు కూడా పోర్ట్ అయ్యారు. దీంతో టెలికాం కంపెనీల మధ్య పోటీ మరింత పెరిగింది. కొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.