Jio Coin vs Bitcoin: జియో కాయిన్ వర్సెస్ బిట్ కాయిన్..ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ముఖేశ్ అంబానీ కొత్త ప్రాజెక్ట్ లక్యం అదేనా?

Jio Coin vs Bitcoin: క్రిప్టోకరెన్సీ ప్రపంచంలోకి ప్రవేశించిన ముఖేష్ అంబానీ కంపెనీ ఇటీవలే తన జియో కాయిన్‌ను విడుదల చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సాంకేతిక విభాగమైన జియో ప్లాట్‌ఫారమ్‌లు పాలిగాన్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఈ భాగస్వామ్యం వెబ్ 3, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని భారతదేశానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం, జియో కాయిన్‌కు సంబంధించిన చర్చలు వేగంగా పెరుగుతున్నాయి.

నివేదికల ప్రకారం, జియో కాయిన్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త ప్రాజెక్ట్. ఇది భారతదేశంలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి రూపొందించింది. 'CoinDCX' నివేదిక ప్రకారం, ఈ వర్చువల్ నాణెం దేశంలో క్రిప్టోకరెన్సీని స్వీకరించడానికి ఒక పెద్ద ముందడుగు అని నిరూపించవచ్చు. ఇది క్రిప్టోకరెన్సీ ప్రపంచంలోకి భారతదేశపు అతిపెద్ద పరిశ్రమ ప్రవేశమని చెప్పుకోవచ్చు.

అయితే, ఈ వర్చువల్ నాణెం అధికారిక మూల్యాంకనం గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. మీడియా నివేదికల ప్రకారం, Jio కాయిన్ ధర టోకెన్‌కు దాదాపు రూ. 43 ($0.50) ఉండవచ్చు. ఈ కాయిన్ మార్కెట్లోకి లాంచ్ చేసిన తర్వాత భారత్ క్రిప్టోకరెన్సీల వినియోగాన్ని పెంచుతుందని..దేశంలో డిజిటల్ ఆర్థిక పరివర్తనలో పెను మార్పులు తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు.
జియో కాయిన్ భారతదేశపు స్వంత క్రిప్టోకరెన్సీ అని చెప్పవచ్చు. బిట్‌కాయిన్ సార్వత్రికమైనది.అయితే బిట్‌కాయిన్‌కు యజమాని లేడు. సతోషి నకమోటో దీనిని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నటికీ దానికి సంబంధించి పూర్తి ఆధారాలు లేవు. అయితే ఇక్కడ Jio కాయిన్ మార్కెట్ విలువ భిన్నంగా ఉంటుంది. దీని సాధ్యమైన ధర రూ. 43 ఉండవచ్చు. బిట్ కాయిన్ లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.0.085గా ఉంది.
జియో కాయిన్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త ప్రాజెక్ట్. ఇది భారతదేశానికి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని తీసుకురావడంలో పెద్ద అడుగు అని చెప్పవచ్చు. దీని సాధ్యమైన ధర టోకెన్‌కు రూ. 43 ($0.50)ఉండే అవకాశం ఉంది. జియో కాయిన్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి ఇంకా ఎలాంటి సమాచారం అధికారికంగా వెల్లడి కాలేదు. భారతదేశ క్రిప్టో మార్కెట్‌కు కొత్త కోణాన్ని అందించడంలో జియో కాయిన్ సహాయపడుతుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
మీరు Jio కాయిన్ కొనుగోలు చేయాలనుకుంటే.. మీరు దీని కోసం జియోస్పియర్ వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించవచ్చు. మీరు ఈ యాప్‌ని మీ Android, iOS, Windows, Mac, Android TV పరికరాలలో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ముందుగా గూగుల్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఇప్పుడు జియోస్పియర్ యాప్‌ని తెరిచి, ప్రొఫైల్ విభాగానికి నావిగేట్ చేయండి. ప్రొఫైల్ విభాగం నుండి Jio కాయిన్ ప్రోగ్రామ్ కోసం సైన్ అప్ చేయండి. రిజిస్ట్రేషన్ తర్వాత, మీరు Jio కాయిన్స్ కొనడం ప్రారంభించవచ్చు.