Jio: జియో న్యూఇయర్ బంపర్ ఆఫర్.. రూ.2025 రీఛార్జీ ప్లాన్‌తో బాబోయి ఎన్ని బెనిఫిట్స్ తెలిస్తే..?
రూ. 2025 రీఛార్జీ ప్లాన్ 5 జీ యాక్సెస్ పొందుతారు. ఇందులో 500 జీబీ 4జీ డేటా (2.5 జీబీ) డేటా పొందుతారు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ప్రతిరోజూ మొత్తం 200 రోజులు వర్తిస్తుంది. ఇందులో రూ.2150 షాపింగ్, డైనింగ్, ట్రావెల్ కూపన్స్ కూడా లభిస్తాయి.
ఇవి కాకుండా రూ.500 ఎజియో కూపన్ షాపింగ్ ఓచర్ రూ.2500 లభిస్తుంది. రూ.499 ఆపై స్విగ్గీ ఆర్డర్ పెడితే రూ.150 ఆఫర్ కూడా పొందుతారు. రూ.1500 ఈజీమైట్రిప్.కామ్ వెబ్‌సైట్ ద్వారా ఫ్లైట్ బుకింగ్ ద్వారా పొందుతారు.
ఈ కొత్త ఏడాది ప్లాన్ 4జీ, 5 జీ రెండిటీ సేవలు పొందవచ్చు. ఈ ప్లాన్ జియో కస్టమర్లకు మంచి బొనాంజ అందిస్తుంది. మీరు కూడా జియో కస్టమర్లు అయితే, వెంటనే ఈ ప్లాన్ రీఛార్జీ చేసుకోండి.
బీఎస్‌ఎన్‌ఎల్ ప్రభుత్వ రంగ కంపెనీకి గట్టి పోటీ అందించడానికి జియో ఈ సరికొత్త ఆఫర్లను అందిస్తోంది. పెరిగిన టెలికాం ధరలతో చాలా మంది కస్టమర్లను కోల్పోయింది. చాలా మంది బీఎస్ఎన్‌ఎల్ కు పోర్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సరికొత్త ఆఫర్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. రిలయన్స్ జియో రీఛార్జీ ప్యాక్‌లతో పాటు జియో సినిమా, క్లౌడ్ వంటి ఇతర బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. అంతేకాదు కొన్ని రకాల రీఛార్జీ ప్యాక్‌లతో ఓటీటీలు కూడా ఫ్రీగా అందిస్తోంది.