Jobs Recruitment 2025: తెలంగాణ ఫుడ్ సేఫ్టీ సంస్థలో జాబ్స్.. రాత పరీక్ష లేకుండా ఉద్యోగం.. రూ.19 వేల జీతం..
రాజన్న సిరిసిల్లకు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అన్ని రకాల వివరాలను క్లుప్తంగా వెల్లడించింది. ఇక ఇందులో ఉద్యోగాల సంఖ్య వివరాల్లోకి వెళితే.. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ 01, శాంపిల్ అసిస్టెంట్ 01 ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ రెండింటిని త్వరలోనే భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి సంబంధించిన ఆర్హత వివరాలను కూడా వెళ్లడించింది. ఇందులో భాగంగా అభ్యర్థులు తప్పకుండా PGDCA Course చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా FSSAI విభాగంలో తప్పకుండా 5 నుంచి 6 సంవత్సరాల పాటు అనుభం ఉండాల్సి ఉంటుంది.
ఇక శాంపిల్ ప్యాకింగ్ జాబ్ వివరాల్లోకి వెళితే.. ఈ జాబ్‌కి సంబంధించిన ఆర్హత కూడా ప్రకటించింది. ఇందులోని తప్పకుండా 12th పాస్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల పాటు శాంపిల్ ప్యాకింగ్‌లో అనుభవం ఉండాల్సి ఉంటుంది.
అలాగే ఈ రెండు జాబ్స్‌కి సంబంధించిన ఎంపికకు సంబంధించిన వివరాలు చూస్తే.. అయితే దీనికి ఎలాంటి రాత పరీక్ష ఉండదని నోటిఫికేషన్‌లో క్లియర్‌గా వెల్లడించారు. ఇక జీతం వివరాలు చూస్తే.. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగికి రూ.19 వేలకు పైగా సాలరీ ఇస్తున్నట్లు తెలిపింది.
ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్ష అప్లికేషన్ ప్రాసెస్ 08-01-2025 తేది నుంచి ప్రారంభమవుతుంది. చివరగా 10-01-2025 ముగుస్తుందని నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ రెండు జాబులకు సంబంధించిన వయస్సు పరిమితి 22 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉంటుంది.