Devara climax: దేవర సినిమాలో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్... క్లైమాక్స్ లో జరగబోయేది ఇదే..!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో రానున్న సినిమా దేవర. సెప్టెంబర్ 27న ఈ సినిమా పాన్ వరల్డ్ లెవెల్ లో విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత విడుదలవుతున్న చిత్రం కావడంతో…ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని చూడడానికి సినీ ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మరోపక్క కొరటాల శివకి గత చిత్రం.. ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది. అందువలన అతనికి చిరంజీవితో గొడవలు కూడా జరిగాయి. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ఎదురుచూస్తున్నారు దర్శకుడు.
ఈ క్రమంలో ఈ దేవర.. చిత్రం రెండు భాగాలుగా రానుంది. ప్రస్తుతం అన్ని భాషలలోనూ సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం ఈ ట్రెండ్ వల్ల కాదు అని.. దేవర సినిమా కథ డిమాండ్ చెయ్యడం వల్లే రెండు భాగాలుగా తీయాల్సి వచ్చింది అని దర్శకుడు చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమా క్లైమాక్స్ బాహుబలి లెవెల్ లో ముగిసి.. రెండో భాగంపై విపరీతమైన అంచనాలు పెంచన ఉంది అని కూడా టాక్ నడుస్తోంది. మరి ఈ ట్విస్ట్ ఏమిటి అనే విషయానికి వస్తే.. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర పాత్రకి సపోర్ట్ గా సైఫ్ అలీఖాన్ తో పాటు శ్రీకాంత్ కూడా నిలుస్తారని.. కానీ చివరిలో సైఫ్ అలీ ఖాన్ తో పాటు శ్రీకాంత్ కూడా మోసం చేస్తారని తెలుస్తోంది.
అంతేకాదు ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, కొడుకు రెండు పాత్రలలో కనిపించనున్నారు. అయితే శ్రీకాంత్ కొడుకుని రెచ్చగొట్టి తండ్రి దేవరపైకే ఉసిగొలుపుతాడని.. దాంతో రెండో భాగంలో తండ్రి, కొడుకు అనగా జూనియర్ ఎన్టీఆర్-జూనియర్ ఎన్టీఆర్ మధ్య గొడవ జరిగే కాన్సెప్ట్ తో ఈ ఫస్ట్ పార్ట్ ముగియనుంది అని కొంతమంది చెబుతున్నారు. ఇక నిజంగానే ఇదే ట్విస్ట్ అయితే.. రెండో భాగం పై అంచనాలు పీక్స్ కి చేరడం ఖాయం.
అంతేకాకుండా రెండో భాగంలో ఒక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మరో జూనియర్ ఎన్టీఆర్ నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నారు అని కూడా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ పాత్రల్లో జీవిస్తారు అన్న సంగతి తెలిసింది. కాబట్టి ఇదే కానీ జరిగితే.. మొదటి బాగా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ లో కాదు రెండో భాగం పైన విపరీతమైన అంచనాలు పెరుగుతాయి. మరి ఇందులో నిజం ఎంతో తెలియాలి అంతే రేపటి వరకు వేచి చూడాలి.