Devara Kerala Collections: ‘దేవర’ కేరళ బాక్సాఫీస్ కలెక్షన్స్.. అక్కడ హిట్టా.. ఫట్టా..
‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రీసెంట్ గా రూ. 500 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది.
విడుదలై నెల రోజులు అవుతున్న ఇప్పటికీ తెలుగులో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది దేవర. కొత్త చిత్రాలు విడుదలైన ఈ సినిమా ముందు నిలబడలేకపోతున్నాయి.
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’. మిక్స్ డ్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. అంతేకాదు రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరో అయిన ఫ్లాప్ అందుకుంటాడనే సెంటిమెంట్ కు బ్రేకులు వేసాడు.
అంతేకాదు 2015లో ‘టెంపర్’ మూవీతో మొదలైన ఎన్టీఆర్ విజయ జైత్రయాత్ర .. ‘దేవర’ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. కంటిన్యూగా తొమ్మిదేళ్ల నుంచి అపజయం ఎరగని హీరోగా టాలీవుడ్ లో ఈ జనరేషన్ లో హైయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న హీరోగా నిలిచాడు.
‘దేవర’ మూవీ తెలంగాణ (నైజాం)లో రికార్డు బ్రేక్ కలెక్షన్స్ తో రాబట్టింది. మొత్తంగా ఇక్కడ రూ. 64 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా తెలుగులో రూ. 170 కోట్ల షేర్ (రూ. 280 కోట్ల గ్రాస్ ) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ‘దేవర’ మూవీ కేరళ విషయానికొస్తే.. అక్కడ రూ. 1 కోటి ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. దాదాపు రూ. 1 కోటి 5 లక్షల కలెక్షన్స్ తో అక్కడ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని అక్కడ సాలిడ్ హిట్ అందుకున్నాడు.
తారక్ విషయానికొస్తే.. దేవర తర్వాత ‘దేవర పార్ట్ 2’ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు ‘వార్ 2’, ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న ‘డ్రాగన్’ మూవీలు లైన్ లో ఉన్నాయి.