Devara 1st Week Box Office Collections: ‘దేవర’ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఎన్టీఆర్ మాస్ ఊచకోత..

Fri, 04 Oct 2024-4:09 pm,

రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేసాడు.  ఈ సినిమాకు తొలి రోజు కొంత మంది పనికట్టుకొని నెగిటివ్ ప్రచారం చేసినా.. అవేవి బాక్సాఫీస్ పై పెద్దగా ప్రభావం చూపించలేదు. అంతేకాదు తొలిరోజే.. దాదాపు రూ. 170 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ మరోసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసాడు. ఆంధ్రావాలా, శక్తి సినిమాల తర్వాత ‘దేవర’ మూవీలో మూడోసారి తండ్రి కొడుకులుగా మెప్పించారు. తండ్రీ కుమారులుగా చేసిన గత రెండు చిత్రాలు ఫ్లాపైనా.. ఆ సెంటిమెంట్స్ ను పట్టించుకోకుండా  ఎన్టీఆర్ ఈ సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు.

మొత్తంగా ఆరు రోజుల్లో దాదాపు అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వారం రోజుల్లో ఈ సినిమా రూ. 405 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లో రెండో రూ. 400 కోట్ల చిత్రంగా ఈ సినిమా నిలిచింది. అంతేకాదు తెలంగాణ (నైజాం)లో ఈ మూవీ రూ. 50 కోట్ల షేర్ అందుకొని సంచలనం రేపింది.

మరోవైపు రాయలసీమలో దాదాపు రూ.23  కోట్ల ఊచకోత కోసింది. ఓవర్సీస్ లో దాదాపు $6 మిలియన్ యూఎస్ డాలర్స్ వైపు పరుగులు తీస్తుంది.

అంతేకాదు దేవర తొలి బ్రేక్ ఈవెన్ అందుకున్నది కూడా ఓవర్సీస్ గడ్డ మీద కావడం విశేషం. అక్కడ దాదాపు రూ. 35 కోట్ల షేర్ (రూ.70 కోట్ల ) గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం దసరా సెలవుల నేపథ్యంలో ఈ సినిమా మరిన్ని వసూళ్లను రాబట్టినా.. ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link